ట్రెండింగ్ న్యూస్

Anchor Ravi : యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తున్న యాంకర్ రవి కొత్త షార్ట్ ఫిలిం 2 am

anchor ravi latest short movie 2 am
Share

Anchor Ravi : యాంకర్ రవి తెలుసు కదా. తెలుగులో ప్రస్తుతం టాప్ యాంకర్. ప్రస్తుతం తెలుగు ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లలో ఏ షోలో చూసినా యాంకర్ గా రవినే. అలాగే యాంకర్ సుమతో కోయాంకర్ గా ఎక్కువగా యాంకర్ రవినే వ్యవహరిస్తున్నారు. యాంకర్ రవి ఎక్కడుంటే అక్కడ నవ్వులే. చాలా స్పాంటెనిటీతో పంచ్ లు వేస్తుంటాడు యాంకర్ రవి.

anchor ravi latest short movie 2 am
anchor ravi latest short movie 2 am

యాంకర్ రవి కేవలం ఒక యాంకర్ గానే కాదు.. వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలింలు, సినిమాల్లోనూ నటిస్తుంటాడు. ఆయనకు చాలా ఆఫర్లు వస్తున్నా చాలా కేర్ ఫుల్ గా మంచి స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా ఓకే చెప్పేస్తాడు. తాజాగా ఆయన ఓ షార్ట్ ఫిలింలో నటించాడు. దాని పేరు 2 am.

Anchor Ravi : చేతబడులపై యాంకర్ రవి చేసిన ప్రయోగమే ఈ షార్ట్ మూవీ

మనం ఎప్పుడూ వింటుంటాం కదా… చేతబడులు అని. చేతబడి గురించి అందరికీ తెలిసిందే. అదో మూడనమ్మకం. దాన్ని చాలామంది నమ్మినా… ఈ జనరేషన్ వాళ్లు అదంతా ఒట్టి ట్రాష్ అంటారు. ఆ కథాంశంపై తీసిన షార్ట్ మూవీనే ఇది. ఈ షార్ట్ ఫిలింలో యాంకర్ రవి… ఒక ఎఫ్ఎమ్ చానెల్ లో ఆర్జేగా పనిచేస్తుంటాడు. రాత్రి పూట షోలలో ఎక్కువగా పనిచేసే రవి.. ఓరోజు తన షోలో చేతబడిపై ఓ ప్రోగ్రామ్ చేస్తాడు. ఆ ప్రోగ్రామ్ లో ఏం జరిగింది అనేదే ఈ షార్ట్ మూవీ. దాని గురించి చెప్పడం కన్నా.. మీరే ఆ షార్ట్ మూవీని చూసేస్తే బెటర్.


Share

Related posts

Arvind Kejriwal: కేజ్రీవాల్ పై కేంద్రం ఫోకస్ !ఫ్లాగ్ కోడ్ ను మహా కష్టపడి వెలికితీసిన ఓ మంత్రిగారు!!

Yandamuri

హోదాకు కేంద్రాన్ని ఒప్పిద్దాం

somaraju sharma

KCR: టీఆర్ఎస్ లో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా కేసిఆర్ కు వీళ్లంటే ప్రాణం..!!

somaraju sharma