Sreemukhi : గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా? శ్రీముఖి Sreemukhi అంటేనే గలగలా మాట్లాడుతుంది. యాంకరింగ్ లో తోపు. అంతే కాదు.. ఏ టాపిక్ అయినా సరే.. ఏదో ఒకటి మాట్లాడుతుంది. అదే ఆమె స్పెషాలిటీ. అందుకే తను పెద్ద యాంకర్ అయిపోయింది. ప్రస్తుతం బుల్లితెర మీద తనకు ఉన్న డిమాండ్ మామూలుగా లేదు.
శ్రీముఖికి జోవియల్ గా ఉండటం ఇష్టం. అందరితో సరదాగా కలిసిపోవడం ఇష్టం. పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం ఇష్టం. అందుకే కాసింత టైమ్ దొరికితే చాలు.. వెంటనే ఏదైనా ఒక పర్యాటక ప్రాంతానికి వెళ్లిపోతుంది. అక్కడ ఫుల్ టు ఎంజాయ్ చేస్తుంది.
తన ట్రిప్స్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎప్పుడూ తన అభిమానులతో టచ్ లో ఉంటుంది.
తనకు యూట్యూబ్ చానెల్ కూడా ఉంది. యూట్యూబ్ చానెల్ లో తన పర్సనల్ వీడియోలు, పర్యాటక ప్రాంతాల వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది.
Sreemukhi : విష్ణుప్రియతో కలిసి ఫుల్ టు ఎంజాయ్ మెంట్
ఇటీవల తనకు హాలీడే దొరకడంతో.. అరియానా, విష్ణుప్రియతో కలిసి తను గోవాకు చెక్కేసింది. ఇక.. కోలా గోవా బీచ్ కు వెళ్లి తను చేసిన హంగామా మామూల్ది కాదు. తన ఫ్రెండ్స్ తో వెళ్లి గోవా లో చేసిన సందడికి సంబంధించిన వీడియోను తను తాజాగా తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేసింది.
ఈ వీడియోను మీరు కూడా చూసి గోవా అందాలను ఆస్వాదించండి.