మన తెలుగు బుల్లితెర మీద ఎక్కువగా వినిపించే పేర్లు యాంకర్ సుమ మరియు కార్తీకదీపం వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాథ్. ఈ రెండు పేర్లు ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాలలో మార్మోగుతున్నాయి. ఈ ఇద్దరికి మహిళా ఫాన్స్ ఫాలోయింగ్ ఎక్కువనే చెప్పొచ్చు. మరి ఇంత ప్రేక్షక ఆదరణ ఉన్న ఇద్దరూ కలసి ఒకే సారి స్క్రీన్ మీద కనిపిస్తే? ఇక తెలుగు మహిళలకు పండగే.
సుమ మరియు ప్రేమి విశ్వనాధ్ కాంబినేషన్లో త్వరలోనే ఓ యాడ్ రాబోతోంది. ఇప్పటి వరకు ఆ యాడ్ లో కేవలం సుమ మాత్రమే నటించింది. ఇకపై ప్రేమీ విశ్వనాథ్ కూడా ఆ యాడ్ లో కనిపించనున్నది. పండగలకు ఎక్కువగా కనిపించే తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్లు యాడ్లో ఫ్యాన్స్ ఇక నుంచి యాంకర్ సుమతో పాటుగా ఇక నుంచి వంటలక్కను కూడా చూడొచ్చట. ఈ విషయాన్ని స్వయంగా ప్రేమీ విశ్వనాథ్ తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
యాంకర్ సుమతో కలసి ప్రేమి చేసిన యాడ్ షూట్ లోని ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రేమి విశ్వనాధ్. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే యాంకర్ సుమ మరియు ప్రేమీ విశ్వనాథ్ ఇద్దరూ మలయాళీ కుట్టీలే. మలయాళ కుట్టీలు అయినప్పటికి ఇద్దరూ తెలుగువారికి అంత్యంత ఆత్మీయులుగా మారిపోయారు. దీంతో త్వరలోనే ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒక యాడ్ రాబోతున్నది.
గతంలో కూడా సుమా మరియు వంటలక్క ఇద్దరు ఓసారి కలిశారు. యాంకర్ సుమ ప్రేమి విశ్వనాధ్ ను ఇంటర్వ్యూ చేశారు. అదే తెలుగులో ప్రేమి విశ్వనాధ్ మొదటి ఇంటర్వ్యూ. అయితే తాజాగా, కార్తీకదీపం సీరియల్ హీరో నిరుపమ్ అలియాస్ డాక్టర్ బాబు తో కలసి మరొక యాడ్ లో కనిపించింది వంటలక్క.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?