యాంకర్ రవి తెలుసు కదా. తెలుగు బుల్లి తెర పైనే టాప్ యాంకర్. ఒక ప్రదీప్, ఒక రవి.. వీళ్లకు ప్రస్తుతం బుల్లితెర మీద చాలా డిమాండ్ ఉంది. అలాగే యాంకర్ సుమకు చాలా పాపులారిటీ ఉంది. తను ఏ షోలో ఉంటే ఆ షో హిట్టే. తన ఆటో పంచులతో.. స్పాంటెనిటీతో స్టేజ్ మొత్తాన్ని ఉర్రూతలూగిస్తుంది సుమ. ఇక.. వీళ్లిద్దరూ కలిస్తే ఇంకేమమన్నా ఉందా? యాంకర్ రవి, సుమ కలిస్తే ఆ షోలో రచ్చ రంబోలానే.

జీ తెలుగులో ప్రసారమయ్యే బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ షోలో ఇద్దరూ కలిసి యాంకరింగ్ చేస్తున్నారు. ఈసారి ఎపిసోడ్ లో గెస్టులుగా ముద్దమందారం ఫేమ్ తనుజ, పవన్ వచ్చారు. వాళ్లిద్దరూ డ్యాన్సులు గట్రా చేసి బాగానే హడావుడి చేశారు.
కానీ.. స్టేజ్ మీదనే యాంకర్ రవిని సుమ.. నువ్వు ఎంత దుర్మార్గుడివి? అంటూ తిట్టేసింది. వెంటనే తేరుకున్న రవి.. నేనేం చేశా.. అంటూ సుమను ప్రశ్నించాడు. నువ్వు పవన్ ప్లేస్ లో ఉండాలనుకుంటున్నావు కదా.. అంటూ సెటైర్ వేసింది. దీంతో నీకు బాగానే అర్థం అయింది కానీ.. ఎడ్డిది దానికి అర్థం కావడం లేదంటూ షాకిచ్చాడు యాంకర్ రవి.
మొత్తం మీద ఈవారం బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ లో వీళ్లు చేసే హడావుడి మామూలుగా లేదు. రచ్చ రచ్చ చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా తాజాగా విడుదలైన ప్రోమోను చూసేయండి మరి..
https://www.youtube.com/watch?v=9KZBLkp_NZM