NewsOrbit
న్యూస్ సినిమా

Anchor Suma: వెండి తెరపై సుమ రెమ్యునరేషన్ అన్ని కోట్లా ..?

Share

Suma Kanakala: సుమ కనకాల… ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదని చెప్పాలి. సుదీర్ఘకాలం పాటు తెలుగు బుల్లితెరపై యాంకర్ గా సుమా స్థానం ఎప్పటికి ప్రత్యేకమైనదే అని చెప్పాలి. మాటలతో మాయ చేయడం ఒక్క సుమా వల్లే అవుతుంది అనే చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. తన మాటలతో ప్రేక్షకులను కట్టి పడేస్తుంది.తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమది ప్రత్యేకమైన స్థానం.

బుల్లితెర మహారాణి :

బుల్లితెర మీద ఎంత మంది యాంకర్స్ వచ్చినా గాని సుమా స్థానం ఎప్పటికి నెంబర్ వన్ అనే చెప్పాలి. కుర్ర యాంకర్స్ తమ అందం,అభినయంతో ప్రేక్షకులను కట్టి పడేస్తున్నారు. ఎంత మంది వచ్చినాగాని సుమా స్థానం మాత్రం ఎప్పటికి పదిలం అనే చెప్పాలి. తన వాక్ చాతుర్యంతో ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. ఒకపక్క యాంకరింగ్ చేస్తూనే ఆడియో ఫంక్షన్స్, యాడ్స్, ఈవెంట్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.

వెండితెర మీద సుమా :

సుమా యాంకరింగ్ చేయకముందు సినిమాల్లో నటించిన విషయం అందరికి తెలిసిందే. ఆ తరువాత నటుడు రాజీవ్(Rajeev) కనకాలను పెళ్లి చేసుకుని ఇద్దరూ పిల్లలకు తల్లి అయింది. ఇద్దరూ పిల్లలు పుట్టినాగాని సుమలో మాత్రం మార్పు రాలేదు. అప్పటికి ఎప్పటికి ఒకేలాగా ఉంది సుమా. తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగ అనర్గళంగా మాట్లాడుతుంది. ఎవరయినా చెబితేనే ఈమె తెలుగు అమ్మాయి కాదు అనే విషయం తెలుస్తుంది. అంతలా తెలుగు ప్రేక్షకులకు సుమా బాగా కనెక్ట్ ఆయిపోయింది.

హీరోయిన్స్ ను మించిన రెమ్యునిరేషన్ :

తాజాగా సుమకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది ..అదేంటంటే త్వరలో సుమా వెండితెరపై కూడా కనిపించనుంది.ఇప్పటి యాంకర్స్ చాలా మంది ఒక పక్క యాంకరింగ్ చేస్తూనే మరోపక్క సినిమాల్లో కూడా నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.ఇప్పుడు ఈ జాబితాలో సుమా కూడా చేరిపోయింది. గత కొన్ని రోజులుగా సుమా వెండి తెరపై నటిస్తుందనే వార్త న్యూస్ వైరల్ అవుతుండగా ఈ వార్తపై తాజాగా సుమా రియాక్ట్ అయింది.

కోటి రూపాయిల రెమ్యునిరేషన్ తీసుకుంటున్న సుమా :

సుమా వెండితెరపై నటిస్తున్న విషయాన్ని కన్ఫర్మ్ చేసిందనే చెప్పాలి. అయితే ఈ విషయాన్నీ కాస్త వెరైటీగా చెప్పింది. స్టార్ హీరోల అందరి వీడియో క్లిప్స్ కట్ చేస్తూ ఒక వీడియో రెడీ చేసి మీడియాలో పోస్ట్ చేసింది.ఏంటి సుమా నువ్వు సినిమాల్లో నటిస్తున్నావా అని కొందరు నటులు అడగగా ”ఇంతమంది అడుగుతున్నారంటే చేసేస్తే పోలే” అంటూ సుమా తన మనసులో మాట చెప్పేసింది.అలాగే సుమా రెమ్యూనరేషన్(remuneration) కూడా కోట్లలో ఉండనుంది అనే హింట్ ఇచ్చేసింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం త్వరలో చెప్పబోతున్నాము అంటూ ఒక వీడియో పోస్ట్ చేయగా అది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.ఇంతకీ సుమ ఏ సినిమాలో నటించనుంది? ఎలాంటి పాత్ర పోషిస్తుంది అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Share

Related posts

Mouni Roy Latest Stills

Gallery Desk

Bunny: ముచ్చటగా మూడోసారి ఆ టాప్ హీరోయిన్ తో బన్నీ..??

sekhar

మహేశ్‌ మ్యూజిక్‌ ట్రీట్‌

Siva Prasad