Anchor Suma : గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. ఆమె మాట్లాడుతుంటే ఆపడం కష్టం. ఆమెతో మాట్లాడటం కూడా కష్టమే. ఎంత స్పాంటెనిటీ అంటే.. తనకున్న స్పాంటెనిటీకి ఎటువంటి ప్రశ్న వేసినా.. ఏం అడిగినా.. టక్కున సమాధానం చెబుతుంది సుమ. అందుకే తను తెలుగులో గొప్ప యాంకర్ సుమ Anchor Suma అయింది. టాప్ ప్లేస్ లో ఉంది. ఇప్పటికీ తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ అందరినీ అలరిస్తోంది.
తెలుగు చానెళ్లలో ప్రసారమయ్యే షోలలో దాదాపు ఎక్కువ షోలలో యాంకరింగ్ చేసి సుమ. ఒకవేళ ఆమెకు కుదరక నో చెబితే.. అప్పుడు ఆ షోకు వేరే యాంకర్ ను పెడుతారు. అది సుమకు ఉన్న డిమాండ్.
Anchor Suma : start music షోలో డాక్టర్ బాబుతో ఆడుకున్న సుమ
స్టార్ మా చానెల్ లో ఇటీవల స్టార్ట్ మ్యూజిక్ అనే షో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇది పూర్తిగా వినోదభరితమైన షో. ఈ షోకు కూడా సుమ యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఈషోకు కార్తీక దీపం సీరియల్ టీమ్ గెస్టులుగా వచ్చారు. డాక్టర్ బాబు కూడా ఈ షోకు రావడంతో.. సుమ మాత్రం డాక్టర్ బాబును ఓ రేంజ్ లో ఆడుకుంది.
చెప్పు దీపను ఎందుకు ఏడిపిస్తున్నావు డాక్టర్ బాబు.. అంటూ వీరలేవల్ లో నటించడంతో.. నువ్వు మహానటివమ్మా.. అంటూ అందరూ సుమను పొగిడేశారు. దీంతో.. నేను సీరియళ్లలో దిగనంత వరకే.. ఒన్స్ ఐ స్టెపిన్.. హిస్టరీ రిపీట్స్ అంటూ చెప్పేసింది. వామ్మో.. నిజంగానే సుమ.. యాంకరింగ్ మానేసి.. సీరియళ్లలోకి వస్తే.. తనకు సీరియళ్ల ఆఫర్లు క్యూ కడతాయి కాబోలు.
ఈ షోకు సంబంధించిన తాజా ప్రోమో వచ్చేసింది. మీరు కూడా చూసి.. సుమ నటన చూసి ఎంజాయ్ చేయండి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!