Anchor Varshini : తెలుసు కదా. ఇప్పుడిప్పుడే తెలుగు బుల్లితెర మీద అవకాశాలను అందుకుంటోంది. యాంకర్ గా తనేంటో నిరూపించుకుంటోంది. తెలుగులో ఫిమేల్ female యాంకర్లలో టాప్ ఎవరో అందరికీ తెలుసు. సుమను మించిన వాళ్లు లేరు. ఆ తర్వాత అనసూయ, శ్రీముఖి, రష్మీ ఉన్నారు. అయితే.. యాంకర్ వర్షిణి కూడా వాళ్లకన్న ఏం తక్కువ కాదు. డ్యాన్స్ బాగా చేస్తుంది, సరదాగా ఉంటుంది. గలగలా మాట్లాడేస్తుంది. అందుకే తనకు యాంకరింగ్ అవకాశాలు కూడా వస్తున్నాయి.
Comedy stars యాంకర్ గా Anchor Varshini
స్టార్ మా చానెల్ లో ఇటీవల కామెడీ స్టార్స్ అనే ఓ కామెడీ ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. ప్రస్తుతం బుల్లితెరను కామెడీ ప్రోగ్రామ్స్ ఏలుతున్నాయి. అందుకే.. కామెడీ స్టార్స్ పేరుతో కామెడీ ప్రోగ్రామ్ ను స్టార్ మా తీసుకొచ్చింది. ఈ షోకు యాంకర్ గా వర్షిణీని తీసుకున్నారు. జడ్జిలుగా శేఖర్ మాస్టర్, సీనియర్ నటి శ్రీదేవిని తీసుకున్నారు.
ముక్కు అవినాష్ తో పాటు.. బొమ్మ అదిరింది, జబర్దస్త్ లలో స్కిట్లు చేసే కంటెస్టెంట్లే ఇందులో కూడా స్కిట్లు చేస్తున్నారు కానీ.. యాంకర్ వర్షిణీ మాత్రం కుర్రకారుకు గుబులు లేపుతోంది.
షో స్టార్టింగే తను చేసిన డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ కు కుర్రకారు ఫిదా అయిపోయారు. వామ్మో.. వర్షిణిలో ఇంత టాలెంట్ ఉందా? తను ఇలాగే డ్యాన్స్ లు చేస్తే ఖచ్చితంగా నెంబర్ వన్ యాంకర్ అవుతుంది.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కామెడీ స్టార్స్ లేటెస్ట్ ప్రోమోను రిలీజ్ చేశారు. మీరు కూడా చూసి ఓ లుక్కేయండి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!