ఇక వెండితెరను ఏలేస్తా.. బుల్లితెర బ్యూటీ వర్షిణి

తెలుగు యాంకర్ వర్షిణి తెలుసు కదా. తన పూర్తి పేరు వర్షిణి సౌందరరాజన్ అయినప్పటికీ.. వర్షిణీగా బాగా ఫేమస్ అయింది. ఢీ షోతో వర్షిణి మరింత ఫేమస్ అయింది. ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్లలో ఒకరిగా వర్షిణీ కొనసాగుతోంది.

anchor Varshini Sounderajan trying her luck in tollywood
anchor Varshini Sounderajan trying her luck in tollywood

అయితే.. ఈ బ్యూటీ తన అదృష్టాన్ని వెండి తెర మీద పరీక్షించుకోబోతోంది. ఇప్పటికే.. అనసూయ, రష్మీ గౌతమ్ తమ లక్ ను వెండి తెర మీద కూడా పరీక్షించుకున్నారు. వాళ్లు అడపా దడపా సినిమాలు చేస్తున్నారు. ఇక.. వాళ్ల రూట్ లోనే వర్షిణి కూడా తన లక్ పరీక్షించుకోబోతోంది.

నిజానికి వర్షిణి ముందుగా వెండితెరతోనే ప్రేక్షకులకు పరిచయం అయింది. చందమామ కథలు సినిమాతో తన సినిమా కెరీర్ ను స్టార్ట్ చేసినప్పటికీ వర్షిణికి ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో తను బుల్లితెర వైపు అడుగులు వేసింది. బుల్లితెరలో తనకు బోలెడు అవకాశాలు రావడంతో పాటు.. తను టాప్ యాంకర్ గా ఎదిగింది.

anchor Varshini Sounderajan trying her luck in tollywood
anchor Varshini Sounderajan trying her luck in tollywood

దీంతో.. ప్రస్తుతం తనకు సినిమా అవకాశాలు కూడా బోలెడు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ ఏజెంట్ వినోద్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. బాబు బాగా బిజీ సినిమా డైరెక్టర్ నవీన్ మేడారం ఈ సినిమాకు డైరెక్టర్.

ఈ సినిమా పూర్తిగా సస్పెన్ష్ థ్రిల్లర్ గా రాబోతోంది. వర్షిణి ఈ సినిమాలో లీడ్ పాత్రలో నటించడంతో పాటు అందాలు కూడా ఆరబోస్తుందట. అలాగే ఈ సినిమాలో మరో లీడ్ పాత్రలో ఫేమస్ హీరో నటిస్తాడని తెలుస్తోంది.

anchor Varshini Sounderajan trying her luck in tollywood
anchor Varshini Sounderajan trying her luck in tollywood

బుల్లితెర మీద ఇప్పటికే తనేంటో నిరూపించుకున్న వర్షిణి… వెండి తెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. చూద్దాం.. తన లక్ ఎలా ఉంటుందో?