నాకు అసలు సినిమాల్లో నటించడమే ఇష్టం లేదు.. యాంకర్ వర్షిణి సంచలన కామెంట్స్

యాంకర్ వర్షిణి తెలుసు కదా. ప్రస్తుతం తెలుగు బుల్లితెర మీద టాప్ యాంకర్ గా కొనసాగుతోంది. అనసూయ, రష్మీతో పోటీ పడుతోంది. తనకు యాంకర్ గా అవకాశాలు కూడా చాలానే వస్తున్నాయి. సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఢీ షోలో హైపర్ ఆదితో కలిసి కో యాంకర్ గా వ్యవహరిస్తోంది వర్షిణి. ప్రస్తుతం తన కెరీర్ బాగానే నడుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో యాంకర్ వర్షిణి కొన్ని సంచలన కామెంట్స్ చేసింది తన కెరీర్ పైన.

anchor varshini speaks about her entry into industry
anchor varshini speaks about her entry into industry

ప్రముఖ కమెడియన్ ఆలీతో సరదాగా కార్యక్రమంలో గెస్ట్ గా వెళ్లిన వర్షిణి.. తనకు అసలు సినిమా ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేదని.. మోడల్ గానే ఉండాలని అనుకున్నానని చెప్పింది.

నేను 16 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి మోడలింగ్ చేస్తున్నాను. అందులోనే ఉందామనుకున్నాను. కానీ.. నాకు తెలిసిన వ్యక్తి.. చందమామ కథలు అనే సినిమాకు ఓ పాత్ర కోసం తీసుకున్నారు. నిజానికి.. ఆ సినిమా చేసేంతవరకు అది సినిమా అని కూడా నాకు తెలియదు. నేను సినిమాల్లోకి వస్తా అని ఎప్పుడూ అనుకోలేదు.. రావాలని కూడా అనుకోలేదు. కానీ.. అలా మూవీస్ లో యాక్ట్ చేయడం జరిగిపోయింది.

అలా.. సినిమాల్లోకి రావాల్సి వచ్చింది అంటూ వర్షిణి తన సినిమా ఎంట్రీ గురించి ఆలీతో చెప్పుకొచ్చింది. దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి మరి..