Anchors: ఒకప్పుడు టీవీ సీరియల్స్‌లో చేసే వారిని సినిమాలలోకి తీసుకోరనే నెగిటివ్ టాక్ ఉండేది. స్మాల్ స్క్రిన్ మీద కనిపిస్తూ పాపులారిటీ తెచ్చుకున్న వారిని సినిమాలలో తీసుకుంటే అది సినిమాలా ప్రేక్షకులు ఎవరూ ఫీల్ అవరనే టాక్ వచ్చేది. అందుకే పలు టీవీ సీరియల్స్‌లో నటిస్తూ మంచి పాపులర్ అయినా కూడా వారికి సినిమాలలో అవకాశాలు దక్కలేదు. కానీ రాను రాను ట్రెండ్ అలాగే జనాల మైండ్ సెట్ కూడా మారింది. స్మాల్ స్క్రీన్ నుంచి వచ్చిన వారిని కూడా జనాలు బాగానే ఆదరిస్తున్నారు.
ముఖ్యంగా యాంకర్స్ సినిమాలలో మంచి ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు యంగ్ యాంకర్స్ హీరోయిన్‌గానూ అవకాశాలు అందుకుంటున్నారు. అప్పటికీ ఇప్పటికీ యాంకర్‌గా టాప్ పొజిషన్లో ఉన్న యాంకర్ సుమ ఓ సినిమాలో హీరోయిన్‌గానూ చేసింది. ఆ తర్వాత దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు ఆమెను హీరోయిన్గా పెట్టి సినిమా చేయాలనుకున్నారు కూడా. కానీ ఆమె బుల్లితెర మీద షోస్ అలాగే సినిమా ఈవెంట్స్‌లో విపరీతమైన బిజీ కావడంతో ఇక సినిమాలలో నటించేందుకు ఆసక్తి చూపించలేదు. ఉదయభాను లాంటి వారు స్పెషల్ సాంగ్స్‌లో కనిపించి ఆకట్టుకున్నారు.
Anchors: గ్లామర్ యాంకర్స్ మాత్రం హీరోయిన్ అవకాశాలతో అదరగొడుతున్నారు.
శిల్పా చక్రవర్తి, అనితా చౌదరి, ఝాన్సీ లాంటి వారు బుల్లితెర మీద క్రేజ్ తెచ్చుకున్నాకే సినిమాలలో నటించే అవకాశాలను అందుకున్నారు. కొన్ని సినిమాలలో వీరికి మంచి పేరే వచ్చింది. కలర్స్ స్వాతి, మంజు భార్గవి, మంజూషా లాంటి వారు సినిమాలలో అవకాశాలను అందుకొని మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే వీరెవరూ హీరోయిన్ అవకాశాలను దక్కించుకోలేకపోయారు. కేవలం క్యారెక్టర్స్ మాత్రమే చేసే అవకాశాలు వచ్చాయి. అయితే ఆ తర్వాత స్మాల్ స్క్రీన్ మీద యాంకర్స్‌గా జనాలలో మంచి క్రేజ్ తెచ్చుకున్న గ్లామర్ యాంకర్స్ మాత్రం హీరోయిన్ అవకాశాలతో అదరగొడుతున్నారు.
రష్మీ గౌతమ్ అంతకముందు సినిమాలలో చిన్న చిన్న అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన గుంటూరు టాకీస్ సినిమాతో హీరోయిన్గా మారింది. ఆ తర్వాత కూడా మంచి రోల్ అయితే హీరోయిన్గా నటిస్తోంది. ఇక అనసూయ క్షణం, రంగస్థలం లాంటి సినిమాలలో మంచి రోల్స్ చేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ మీద అనసూయకి ఉన్న క్రేజ్ బాగానే ఉంది. ప్రస్తుతం ఆమెకు ఏకంగా పాన్ ఇండియన్ సినిమాలలో అద్భుతమైన అవకాశాలను అందుకుంటోంది.
Anchors: యాంకర్ వర్షిణి సినిమాలలో మంచి అవకాశాలను అందుకుంటోంది.
శ్రీముఖి ఒకవైపు మంచి రోల్స్ చేస్తూ..మరొకవైపు హీరోయిన్ సెంట్రిక్ రోల్స్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు రష్మీ, అనసూయ, శ్రీముఖి వరుసలోనే మరో గ్లామర్ యాంకర్ వర్షిణి సినిమాలలో మంచి అవకశాలను అందుకుంటోంది. ఇటీవలే ఈమె స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న శాకుంతలం సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది. అంతక ముందు కూడా వర్షిణి ఓ సినిమాలో హీరోయిన్గా నటించింది. వీరు మాత్రమే కాదు మేల్ యాంకర్స్ ప్రదీప్ మాచి రాజు..సుడిగాలి సుధీర్ హీరోలుగా మారారు. జబర్దస్త్ కమెడియన్స్ కూడా సినిమాలలో మంచి అవకాశాలను అందుకుంటూ సత్తా చాటుతున్నారు.