ఇక టాలీవుడ్ లో మిగిలిన అనుష్క శెట్టి మీదే అందరి ఫోకస్ ..!

టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్స్ అంటే అనుష్క శెట్టి.. కాజల్ అగర్వాల్ అన్న సంగతి తెలిసిందే. ఇద్దరు ఇండస్ట్రీలో అడుగుపెట్టి 13 ఏళ్ళు దాటింది. సక్సస్ పరంగా కూడా ఇద్దరి కెరీర్ గ్రాఫ్ ఇంచు మించు ఒకేలా ఉంటుంది. అంతేకాదు దాదాపు ఇద్దరు హీరోయిన్స్ తెలుగు తమిళంలో అందరి స్టార్స్ కి జంటగా నటించారు. అంతేకాదు ఇద్దరు ఇప్పటికీ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నారు.

Kajal Aggarwal and Anushka Shetty are front runners for Gopichand's next with Teja? | Telugu Movie News - Times of India

ఇటీవలే అనుష్క శెట్టి నిశ్శబ్ధం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఇప్పటికే తమిళంలో సూర్య – హరి కాంబినేషన్ లో మొదలవనున్న సింగం సిరీస్ లో అనుష్క నటించనుందన్న టాక్ ఉంది. అలాగే కమల్ హాసన్ నటించబోయో సినిమా కూడా అంగీకరించిందని అంటున్నారు. అయితే నవంబర్ 7 న అనుష్క బర్త్ డే సందర్భంగా తన కొత్త ప్రాజెక్ట్స్ కి సంబంధించిన విషయాలని అధికారకంగా వెల్లడించనున్నట్టు సమాచారం.

ఇక చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య, శంకర్ – కమల్ హాసన్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2, మంచు విష్ణు నటిస్తున్న మోసగాళ్ళు సినిమాల తో పాటు హిందీలో ముంబై సాగా అన్న సినిమాలు కమిటయింది. ఇవన్ని ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.

కాగా కాజల్ అగర్వాల్ పెళ్ళి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించబోతుంది. ముంబై కి చెందిన వ్యాపర వేత్త ని ఈ నెల 30 న పెళ్ళి చేసుకుంటుంది. దీంతో ఇక టాలీవుడ్ లో ఇప్పుడు అందరి చూపు అనుష్క శెట్టి మీదే ఉంది. గత కొంతకాలంగా అనుష్క పెళ్ళి విషయంలోనూ రక రకాల వార్తలు వస్తున్నాయి. కాని ఇంకా అనుష్క మాత్రం తన పెళ్ళి సంబధించి వస్తున్న వార్తలకి స్పందించడం లేదు. చూడాలిమరి కాజల్ మాదిరిగా అనుష్క కూడా సడన్ గా గుడ్ న్యూస్ చెప్పి సర్‌ప్రైజ్ చేస్తుందేమో.