NewsOrbit
న్యూస్

ఏపిలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల..ఎప్పటి నుండి అంటే..?

ఏపిలో పదవ తరగతి పరీక్షల టైం టేబుల్ విడుదల అయ్యింది. 2023 ఏప్రిల్ 3వ తేదీ నుండి 18వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు టెన్త్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు ఏపి పాఠశాల విద్యా కమీషనర్ పరీక్షల టైం టేబుల్ ను విడుదల చేశారు. ఆరు సబ్జెక్ట్ లకే పరీక్ష నిర్వహణ ఉండనుందని బోర్డు తెలిపింది. అలాగే ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షా సమయంగా నిర్ణయించారు. సీబీఎస్ఈ తరహాలో రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించనున్నారు.

పరీక్షలకు సంబంధించి ఎటువంటి అపరాధ రుసుము లేకుండా అంటే రూ.125ల పరీక్షా రుసుముతో ఈ నెల 24వ తేదీ వరకూ ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తులను స్వీకరించగా, 50 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 29వ తేదీ వరకూ ధరఖాస్తులను స్వీకరించారు. ప్రస్తుతం జనవరి 3వ తేదీ వరకూ 200 రూపాయల అపరాధ రుసుముతో, ఆ తర్వాత 9వ తేదీ వరకూ రూ.500లు అపరాధ రుసుముతో ధరఖాస్తులను స్వీకరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వరకూ 26వ జిల్లాల నుండి 6,60,859 మంది విద్యార్ధినీ విద్యార్ధులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు ధరఖాస్తు చేసుకున్నారు. కేజీబీవీ పాఠశాల విద్యార్ధులు, దివ్యాంగులకు పరీక్షా రుసుము నుండి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.

andhra pradesh 10th exam time table 2023 released

పదవ తరగతి పరీక్షల టైం టేబుల్

ఏప్రిల్ 3 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1
ఏప్రిల్ 6 సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 8 ఇంగ్లీషు
ఏప్రిల్ 10 లెక్కలు
ఏప్రిల్ 13 సైన్స్
ఏప్రిల్ 15 సోషల్ స్టడీస్ పరీక్షలు ఉంటాయి.

ఏప్రిల్ 17 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 (కంపోజిట్ కోర్సు), ఓఎస్ఎస్ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 1
ఏప్రిల్ 18 ఓఎస్ఎస్ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్) వోకేషనల్ కోర్సు పరీక్ష ఉండనుంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju