NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు అయ్యింది. పోస్టల్ బ్యాలట్ తో కలిపి 81.76 శాతం నమోదు అయ్యింది. రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఎత్తున పోలింగ్ జరగడం ఇదే తొలి సారి. ఉమ్మడి రాష్ట్రంలో 2009 లో జరిగిన ఎన్నికల్లో 72.63 శాతం, 2014 లో 78.90 శాతం, 2019 లో 79.80 శాతం మేర పోస్టల్ బ్యాలట్ కలిపి పోలింగ్ నమోదు అయ్యింది. సోమవారం అర్ధరాత్రి దాటిన 2 గంటల వరకూ 47కు పైగా కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింది. దీంతో పోలింగ్ శాతం పై బుధవారం ఉదయం వరకూ స్పష్టత రాలేదు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. పల్లెలు, పట్టణాలు అనే బేధం లేకుండా ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండి బారులు తీరి ఓటు వేశారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయానికి 78.25 శాతం పోలింగ్ నమోదైనట్లు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.

mukesh kumar

అయితే పోలింగ్ శాతం పై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా ట్విట్టర్ వేదికగా పోలింగ్ శాతం వెల్లడించారు. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైనట్లు సీఈవో తెలిపారు. రాష్ట్రంలో ఈవీఎంల ద్వారా 80.66 శాతం పోలింగ్ నమోదు అయినట్లు వెల్లడించారు.

కాగా, దేశంలో నాలుగో విడత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ అయిన రాష్ట్రంగా ఏపీ గుర్తింపు సాధించింది.  యువత, మహిళల్లో అత్యధిక శాతం ఓటింగ్ లో పాల్గొన్నట్లు రాజకీయ పక్షాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఒంగోలు లోక్ సభ నియోజకవర్గంలో 87.06 శాతం నమోదు అయ్యింది. అత్యల్పంగా విశాఖలో 71.11 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?