NewsOrbit
Featured న్యూస్

వహ్వా..! ఆ పత్రికకు కలెక్టర్లు ఊహించని షాక్ ఇచ్చారు..!

andhrajyothi paper facing troubles from ap ias officers

దేశంలో, రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించి వ్యవస్థల్ని నడిపించేది కలెక్టర్లే. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల్ని అధికారులకు నిర్దేశిస్తూ ప్రజల వరకూ ఆ ఫలాల్ని తీసుకెళ్లేది కలెక్టర్లే. ఒకరకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి కలెక్టర్లు. అడ్మినిస్ట్రేషన్ ను నడిపించడం సామాన్య విషయం కాదు. జిల్లా యంత్రాంగానకి ఆదేశాలు జారీ చేయడం.. వాటిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో వారిదే కీలకపాత్ర.. రెవెన్యూ వ్యవస్థను నడిపించడం నుంచి జిల్లా మేజిస్ట్రేట్ గా కలెక్టర్లకు విశేష అధికారాలు ఉంటాయి. ఇటువంటి కలెక్టర్లపై ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించిన ముఖచిత్ర కథనం వారి ఆగ్రహానికి కారణమైంది.

andhrajyothi paper facing troubles from ap ias officers
andhrajyothi paper facing troubles from ap ias officers

కలెక్టర్లపై ఆంధ్రజ్యోతి కథనం ఇదే..

రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని రెండు జిల్లాల కలెక్టర్లు ‘హనీ ట్రాప్’లో పడ్డారని ఏకంగా కథనం రాసేసింది ఆంధ్రజ్యోతి. వీరిలో ఒకరు రాయలసీమ ప్రాతంలోని కలెక్టర్, మరొకరు కొస్తా జిల్లాకు చెందిన కలెక్టర్ గా రాసింది. రాయలసీమ ప్రాంత కలెక్టర్ స్త్రీలోలుడు అన్నట్టు పేర్కొంది. ఓ మహిళా అధికారిని తానున్న చోటుకే రప్పించుకున్నారని.. వీరి వ్యవహారంతో ఆమె కుటుంబంలో చిచ్చు రేగితే విడాకులు ఇప్పించేంత వరకూ కలెక్టర్ వెళ్లారని పేర్కొంది. దీంతో ప్రభుత్వం మరొక మహిళను నియమిస్తే ఆమెతో కూడా ఇదే పద్దతి.. ఆమె ఎదురుతిరిగి ప్రభుత్వానికి కంప్లైంట్ చేసే వరకూ వెళ్లిందని రాసింది. కోస్తా జిల్లా కలెక్టర్ మాత్రం ఓ మహిళా అధికారి వలలో అనుకోకుండా చిక్కుకుపోయారని.. కొందరు ప్రైవేటు వ్యక్తులకు కలెక్టర్ ద్వారా ప్రయోజనం చేకూర్చడం చేయించారని రాసింది.

ఆంధ్రజ్యోతికి కలెక్టర్లు ఇచ్చిన ట్విస్టు ఇదే..

ఆంధ్రజ్యోతి ఈ కథనాన్ని వ్యూహాత్మకంగా పేర్లు లేకుండా రాసామని సంబరపడేలోపే.. కలెక్టర్ల నుంచి ఊహించని షాక్ తగిలింది. ఆ ఇద్దరూ బయటకు రారులే.. అనే ధైర్యంతో ఉన్న ఆంధ్రజ్యోతికి ఏకంగా 13 జిల్లాల కలెక్టర్లు కలసి ఆంధ్రజ్యోతికి నోటీసు ఇచ్చి ఎండీ రాధాకృష్ణకు పెద్ద జోల్ట్ ఇచ్చారు. కలెక్టర్లు అందరూ తామంతా ఒకటే.. అనే సందేశాన్నిస్తూ ఆంధ్రజ్యోతికి నోటీసులిచ్చారు. ఇందులో ప్రభుత్వ పెద్దల జోక్యం ఉన్నా లేకున్నా.. కలెక్టర్లు అందరూ కలవడంతో ఊహలతో రాతలు రాసిన ఆంధ్రజ్యోతికి కంటి మీద కునుకు లేకుండా చేశారు. తన పత్రికా జీవితంలో ఎన్నో రకాల నోటీసులందుకున్న ఆంధ్రజ్యోతి ఏకంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు నుంచి నోటీసులు అందుకోవడం ఊహించని షాక్. దీన్నుంచి ఎలా తేరుకుంటారో.. ఆంధ్రజ్యోతి సమాధానమేంటో చూడాల్సందే.

author avatar
Muraliak

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!