Anil ravipudi: సక్సెస్ ఫార్ములా పట్టుకున్న అనిల్ రావిపూడి..అందుకే రాజమౌళి మాదిరిగా ఒక్క ఫ్లాప్ కూడా చూడలేదు

Share

Anil ravipudi: సినిమా ఇండస్ట్రీలో వరుసగా హిట్స్ ఇవ్వడం అంటే అంత ఈజీ కాదు. చాలామంది హీరోలకి ఒక్క భారీ హిట్ వస్తే ఆ నెక్స్ట్ సినిమా భారీ డిజాస్టర్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. దర్శకులకి ఇలా జరిగిన సందర్భాలు చాలానే. డెబ్యూ సినిమా కోసం ఉన్న టాలెంట్ మొత్తం ఉపయోగించి విపరీతంగా శ్రమపడి ఫస్ట్ హిట్ అందుకుంటారు. కానీ రెండవ సినిమా వచ్చేసరికి ఫ్లాప్ మూట కట్టుకుంటుంది. కానీ అనిల్ రావిపూడి ఇప్పటి వరకు తెలుగులో అన్నీ బ్లాక్ బస్టర్ సినిమాలే తీసి క్రేజీ డైరెక్టర్‌గా మారాడు.

anil-ravipudi-has a success formula in his hand
anil-ravipudi-has a success formula in his hand

టాలీవుడ్‌లో ఇలా వరుసగా సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్, పాన్ ఇండియన్ సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమ రేంజ్ హాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తీసిపోదని చాటి చెప్పిన ఘనత ఎస్ ఎస్ రాజమౌళిది. ఛత్రపతి సినిమాతో దర్శకుడిగా ఆయన స్థాయి మరో రేంజ్‌కి వెళ్ళింది. ఇక బాహుబలి సినిమాతో రాజమౌళికి దర్శక ధీరుడు అనే బిరుదు ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీ. ఇన్నేళ్ళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ సినిమా తీయడం సాధ్యమయింది అంటే అది ఒక్క రాజమౌళితోనే. స్టూడెంట్ నంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా మొదలైన రాజమౌళి ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నారు.

Anil ravipudi: ఇదే ఫార్ములాను తన తర్వాత సినిమాలకి ఫాలో అవుతున్నాడు.

టాలీవుడ్‌లో ఇలా సక్సెస్ ఫార్ములా పట్టుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. కథలో హీరోయిజం, ఫ్యామిలీ ఆడియన్స్‌కి కావాల్సిన అంశాలు, మంచి కామెడి, సంగీతం..ఇలా అన్నీ సమపాళ్లలో ఉండేలా పక్కాగా కథను సిద్దం చేసుకున్న తర్వాతే దానికి తగ్గ హీరో కోసం వేట మొదలు పెట్టి ఆ హీరోతో సినిమా తీసి సక్సెస్ అవుతున్నాడు. నందమూరి కళ్యాణ్ రాం హీరోగా ఆయన తెరకెక్కించిన మొదటి సినిమా పటాస్. కాప్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలో అన్నీ వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అంశాలు ఉండటంతో సినిమా మంచి కమర్షియల్ హిట్‌గా నిలిచింది.

ఇదే ఫార్ములాను తన తర్వాత సినిమాలకి ఫాలో అవుతున్నాడు. ఎక్కువగా ప్రయోగాల జోలికి వెళ్ళకుండా హీరోని ఎలా చూపిస్తే అభిమానులకి నచ్చుతుందో..దాన్ని దృష్ఠిలో పెట్టుకొని అనిల్ రావిపూడి కథ రాసుకుంటున్నాడు. ఇప్పుడున్న కొందరు యంగ్ డైరెక్టర్స్ ఒక హిట్ పడ్డాక ప్రయోగాలంటే ఏవోవో కథా నేపథ్యాలను ఎంచుకొని, దాన్ని సరిగ్గా మలచలేక బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్‌ను మూటకట్టుకుంటున్నారు. అలా చూస్తే అనిల్ రావిపూడి కూడా రవితేజతో చేసింది ప్రయోగమే అని చెప్పాలి.

Anil ravipudi: రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజని గుడ్డివాడిగా చూపించాలనుకోవడం సాహసమే

రవితేజ వరుస ఫ్లాపుల్లో ఉంటే కూడా రాజా ది గ్రేట్ అనే సినిమాలో ఆయనని గుడ్డివాడిగా చూపించాలనుకోవడం సాహసమే అని చెప్పాలి. హీరో ఒక అంధ పాత్రలో నటించడం అంటే ఇప్పుడున్న ఆడియన్స్ అంత త్వరగా రిసీవ్ చేసుకోలేరు. కానీ ఇక్కడ అనిల్ రావిపూడి ఎంచుకున్న కథ, కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాంతో హ్యాట్రిక్ హిట్ అందుతున్నాడు. రవితేజకి మంచి బ్రేక్ ఇచ్చాడు. ఎఫ్ 2 అనే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో సినిమా తీసి 100 కోట్ల క్లబ్‌లో చేర్చడం అంటే గొప్ప విషయం. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబును సరిలేరు నీకెవ్వరూ అంటూ మాస్ హీరోగా చూపించి భారీ హిట్ ఇచ్చాడు.

అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్2 సీక్వెల్‌గా ఎఫ్3 సినిమాను చేస్తున్నాడు. విక్టరీ వెంకటేశ్ – మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా – మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దిల్ రాజు దీనికి నిర్మాత. ఈ సినిమా తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా చేయనున్నారు. ఇందులో కూడా అనిల్ రావిపూడి కామెడి ఎంటర్‌టైన్మెంట్ ఉండబోతోంది.


Share

Related posts

Mahesh babu – Trivikram Movie: మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమాకి ఆసక్తికర టైటిల్..!?

Srinivas Manem

మాన‌సిక వేద‌న‌కు గుర‌య్యాను

Siva Prasad

బ్రేకింగ్ : మాస్క్ పెట్టుకోలేదని పోలీసే చంపేశాడు… చీరాల లో ఘోరం

arun kanna