Anil ravipudi – Mehreen: అనిల్ రావిపూడికి బాగా కలిసొచ్చిన మెహ్రీన్..అందుకే మరోసారి…!

Share

Anil ravipudi – Mehreen: ఒక దర్శకుడు హీరోయిన్‌ను అదే పనిగా రిపీట్ చేస్తున్నాడంటే ఆ హీరోయిన్ లక్కీ హీరోయిన్ అని ఫిక్సైపోవచ్చు. ఇలా ఒకే హీరోయిన్‌ను రెండు మూడు సినిమాలకు రిపీట్ చేసే దర్శకుడు మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన ఏ హీరోయిన్‌ను తీసుకున్నా వరుసగా మూడు సినిమాలలో అవకాశం ఇస్తాడు. అంతేకాదు గురూజీ ఓ హీరోయిన్‌ను ఫిక్స్ చేసుకుంటే ఆ హీరోయిన్‌కు భారీ హిట్ ఇచ్చి క్రేజీ హీరోయిన్‌ను చేసేస్తాడు. ఇలియానాతో జల్సా, జులాయి సినిమాలు చేశాడు. సమంతతో అ..ఆ, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు చేశారు.

anil-ravipudi-repeats mehreen as heroine
anil-ravipudi-repeats mehreen as heroine

ఇక పూజా హెగ్డేతోనూ అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో సినిమాలు చేసిన గురూజీ మంచి హిట్స్ ఇచ్చాడు. హరీష్ శంకర్ కూడా పూజా హెగ్డేను బాగా రిపీట్ చేశాడు. దువ్వాడ జగన్నాథం, గద్దలకొండ గణేశ్ సినిమాలలో పూజాను హీరోయిన్‌గా తీసుకున్న హరీష్ శంకర్..ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలోనూ పూజా హెగ్డేనే హీరోయిన్‌గా తీసుకున్నాడు. ఈ లిస్ట్‌లో మరో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా చేరాడు. ఆయన ఇప్పటి వరకు తన సినిమాలలో రిపీట్ చేసిన హీరోయిన్ అంటే ఒక్క మెహ్రీన్ మాత్రమే.

Anil ravipudi – Mehreen: ఇందులో హీరోయిన్‌గా మెహరీన్ ఎంపికైనట్టు సమాచారం.

మాస్ మహారజ రవితేజ నటించిన రాజా ది గ్రేట్ సినిమాలో హీరోయిన్‌గా మెహ్రీన్ నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. దాంతో ఆ తర్వాత ఆయన మల్టీస్టారర్‌గా తెరకెక్కించిన ఎఫ్2 సినిమాలో వరుణ్ తేజ్‌కు జంటగా తీసుకున్నాడు. అలాగే ఆ సినిమా సీక్వెల్‌గా వస్తున్న ఎఫ్3 సినిమాలోనూ మరోసారి వరుణ్ తేజ్‌కు జంటగా మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇలా మూడు సినిమాలలో మెహ్రీన్‌కు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పుడు మరోసారి ఛాన్స్ ఇవ్వబోతున్నాడట. అదే బాలకృష్ణ సినిమా. అనిల్ రావిపూడి – బాలయ్య కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో హీరోయిన్‌గా మెహరీన్ ఎంపికైనట్టు సమాచారం.


Share

Related posts

కళ్ల అద్దాల‌పై కూడా క‌రోనా జీవిస్తుంది.. వ్యాప్తి చెందే అవ‌కాశాలు ఎక్కువే..!

Srikanth A

టైటిల్‌తో నిఖిల్‌కు కొత్త సమస్య

Siva Prasad

ఆ నేత ఎంత లక్కీ అంటే సిఎం నుండే అభినందనల ఫోను వచ్చింది.

Yandamuri