Anil ravipudi : అనిల్ రావి పూడి సక్సస్ ఫుల్ సిరీస్ ఎఫ్ 2 కి సీక్వెల్ ఎఫ్ 3 ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 2019లో విడుదలైన ఎఫ్ 2 సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ వెంకటేష్ – వరుణ్ తేజ్ ప్రేక్షకుల పొట్ట చెక్కలయ్యేలా చేశారు. ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరి దిల్ రాజు కి కాసుల వర్షం కురుపించింది. దీంతో.. ఎఫ్-3 సినిమాకి సన్నాహాలు చేసి రీసెంట్ గా సెట్స్ మీదకి తీసుకు వచ్చారు. ఎఫ్ 2 లో నటించిన వెంకటేష్ – వరుణ్ తేజ్ – తమన్నా – మెహ్రీన్.. ఎఫ్ 3 లో కూడా నటిస్తుండటం విశేషం.
కాగా గత నెల రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. సమ్మర్ టార్గెట్ సినిమా ఎఫ్ 3 ని రిలీజ్ చేయాలని అనిల్ రావిపూడి పక్కా ప్లాన్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఎఫ్ 3 మీద భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఇప్పటికే ఎఫ్ 3 కాన్సెప్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేయగా ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఖచ్చితంగా ఎఫ్ 2 కంటే మోర్ ఫన్ అండ్ ఫ్రస్టేషన్ చూపించబోతున్నారని ఈ కాన్సెప్ట్ పోస్టర్ తో హింట్ ఇచ్చారు మేకర్స్. కాగా ఈ సినిమా కి సంబంధించిన న్యూస్ ఒకటి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Anil ravipudi : అదంతా ఫేక్ న్యూస్ అంటూ క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి..!
ఈ విషయంలో తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించాడు. ఫ్యాన్స్ హర్ట్ అయ్యే న్యూస్ చెప్పాడు. ఎఫ్ 3 లో మూడవ హీరో ఉంటాడని గత కొన్ని రోలుగా ప్రచారం జరుగుతోంది. ఆ హీరో రవితేజ అని కొన్నాళ్ళు.. రీసెంట్ గా మెగా హీరో సాయి ధతం తేజ్ నటిస్తున్నట్టు వార్తలు రాగా అనిల్ రావిపూడి కొట్టిపారేశాడు. ఎఫ్-3 సినిమాలో మూడో హీరో ఉండడని తేల్చిపారేశాడు. దాంతో మెగా అభిమానులు అలాగే కామన్ ఆడియన్స్ కాస్త డిసప్పాయింట్ అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎఫ్ 3 సినిమాకి సంబంధించి వస్తున్న రూమర్స్ కి మాత్రం అనిల్ రావిపూడి చెక్ పెట్టేశాడు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!