Anitha: ఫేడౌట్ అయిన అనిత ఇప్పుడు గ్లామర్ పిక్స్ పెట్టి ట్రై చేస్తే టాలీవుడ్ హీరోలు, దర్శకులు ఛాన్స్ ఇస్తారా..?

Share

Anitha: సినిమా ఇండస్ట్రీలో ఐరెన్ లెగ్ అని ముద్ర పడిన హీరోయిన్స్‌ని, ఒక్కసారి అవకాశాలు తగ్గి ఫేడౌట్ అయిన హీరోయిన్స్‌ని అంత త్వరగా మళ్లీ మేకర్స్ గానీ హీరోలు గానీ ఎంకరేజ్ చేయరు. ఇది ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా చెప్పుకునే మాటే. గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త అందాలను చూడటానికే జనాలు ఇష్టపడుతుంటారు. అందుకే దర్శక, నిర్మాతలు సాధ్యమైనంత వరకు కొత్త హీరోయిన్స్‌ని లేదా బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్స్‌కే అవకాశాలు ఇస్తుంటారు.

anitha-is fade out from tollywood industry
anitha-is fade out from tollywood industry

సక్సెస్‌లలో ఉండి పెళ్ళైన హీరోయిన్స్ కూడా కెరీర్‌ని కంటిన్యూ చేయడం కష్టమే. సమంత, కాజల్ లాంటి వారికే ఇప్పుడు సాధ్యమవుతుంది. ప్రియమణి లాంటి క్రేజీ హీరోయిన్స్ పెళ్ళి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నా కూడా అదృష్టం కలిసి వచ్చి మళ్ళీ సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటుంటారు. లేదా అక్క, వదిన, అమ్మ పాత్రలు చేసే అవకాశాలు అందుకుంటుంటారు. అయితే గట్టిగా ఓ పది సినిమాలు కూడా చేయకుండా చిన్న వయసులోనే ఫేడౌట్ అయిన కొంతమంది హీరోయిన్స్ మాత్రం అవకాశాల కోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటారు.

Anitha: తేజ ఇండస్ట్రీకి తీసుకు వచ్చిన హీరోయిన్స్‌లో అనిత ఒకరు.

అలాంటి వారిలో నేహ శర్మ, అనిత లాంటి వారున్నారు. తేజ ఇండస్ట్రీకి తీసుకు వచ్చిన హీరోయిన్స్‌లో అనిత ఒకరు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో కాజల్ అగర్వాల్‌ని, జయం సినిమాతో సదాని టాలీవుడ్‌కి పరిచయం చేశాడు దర్శకుడు తేజ. కాజల్ అగర్వాల్ ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున లాంటి సీనియర్ స్టార్ హీరోలకి ఇప్పుడు కాజల్ మంచి ఛాయిస్. ఆమెకి ఇప్పుడున్న క్రేజ్ అసాధారణం కూడా. కోలీవుడ్‌లో కూడా కాజల్ ఇండియన్ 2లాంటి పాన్ ఇండియన్ సినిమా చేస్తోంది. సదా కూడా చాలాకాలం సూపర్ హిట్ సినిమాలు చేసి క్రేజ్ సంపాదించుకుంది.

ఆ క్రేజ్‌తో బుల్లితెర మీద కూడా కొన్ని షోలకి జడ్జ్‌గానూ వ్యవహరిస్తున్నారు. అవకాశాలు వస్తే మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇదే క్రమంలో తేజ పరిచయం చేసిన బ్యూటీ అనిత కూడా ఇప్పుడు లేటెస్ట్ గ్లామర్ ఫొటో షూట్స్ మేకర్స్‌ని యంగ్ హీరోలను ఆకట్టుకునే పనిలో పడింది. ఈ మధ్య సోషల్ మీడియాలో రక రకాల గ్లామర్ పిక్స్‌తో సందడి చేస్తోంది. అభిమానులకి కొత్త లుక్స్‌తో ఉన్న పిక్స్‌ను షేర్ చేస్తూ మళ్ళీ సినిమాలలో అవకాశాల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఆ పిక్స్ కాస్త ఓవర్ డోస్ గానూ ఉన్నాయి.

Anitha: కేవలం 5 సినిమాలకే అనిత ఇండస్ట్రీ నుంచి దూరం అయింది.

నువ్వు నేను సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అనిత ఆ తర్వాత శ్రీరామ్ అనే సినిమాలోనూ నటించింది. ఈ రెండు సినిమాలలో హీరో ఉదయ్ కిరణ్. ఆ తర్వాత నిన్నే ఇష్టపడ్డాను, నేను పెళ్ళికి రెడీ, తొట్టి గ్యాంగ్ సినిమాలు చేసింది. కేవలం 5 సినిమాలకే అనిత ఇండస్ట్రీ నుంచి దూరం అయింది. హిందీ, తమిళం, కన్నడ లాంటి భాషలలో నటించినా అక్కడ కూడా ఎక్కువ సినిమాలు చేయకుండానే పెళ్ళి చేసుకొని సినిమా కెరీర్‌కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. మళ్ళీ ఇంతకాలానికి సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలని తాపత్రయపడుతోంది. అప్పుడే రాం చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోల సరసన అవకాశాలు అందుకోలేకపోయింది. ఇప్పుడు ఎలా అవకాశాలు అందుకుంటుందో చూడాలి.


Share

Related posts

బోయ‌పాటి దిగొచ్చాడు

Siva Prasad

యుపిలో బీజేపీ నేత దారుణ హత్య

somaraju sharma

బిగ్ బాస్ 4: డమ్మీ పేరెంట్స్ తో కోర్టు మెట్లు ఎక్కిన సోహెల్..??

sekhar