Anjali : అంజలి జర్నీ సినిమాతో బాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అన్న మల్టీస్టారర్ లో వెంకటేష్ కి జంటగా నటించింది. ఈ సినిమా పెద్ద హిట్ గా నిలిచింది. దాంతో సీనియర్ స్టార్ హీరోలకి మంచి జోడీ అని అందరూ భావించారు. కాని ఎందుకనో అంజిలికి అనుకున్నంతగా అవకాశాలు దక్కలేదు. కొన్ని హిట్ సినిమాలు చేసినా కూడా అంజలి తెలుగులో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది.
ఈ సాంగ్ తో కనీసం కంటిన్యూస్ గా స్పెషల్ సాంగ్స్ లో స్టెపులేసే అవకాశం వస్తుందనుకున్నారు. అది కూడా కుదరలేదు. అనుష్క నటించిన నిశ్శబ్ధం సినిమాలో ఒక రోల్ చేసింది అంజలి. ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. దాంతో అంజలికి ఈ సినిమా ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇప్పుడు అంజలి ఆశలన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా మీదే ఉన్నాయి. బాలీవుడ్ లో హిట్ సినిమా పింక్ కి రీమేక్ సినిమాగా వకీల్ సాబ్ రెడీ అవుతోంది. వచ్చే నెల 9న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
Anjali : అంజలికి వకీల్ సాబ్ సక్సస్ మీదే నెక్స్ట్ ఏంటన్నది ఆధారపడి ఉంది.
ఇటీవలే వకీల్ సాబ్ లేటెస్ట్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ లని రివీల్ చేశారు. పవన్ కళ్యాణ్ తో ఉన్న ఈ ముగ్గురి ఫొటో బాగానే ఆకట్టుకుంది. చూడాలి మరి వకీల్ సాబ్ రిజల్ట్ ఎలా ఉంటుందో. ఈ మధ్య నివేదా థామస్ జోరు కూడా కాస్త తగ్గింది. వకీల్ సాబ్ తర్వాత మళ్ళీ నివేదా థామస్ కి వరస అవకాశాలు వస్తాయో లేదో చూడాలి. ఇక అంజలికి అయితే ఈ సినిమా సక్సస్ మీదే నెక్స్ట్ ఏంటన్నది ఆధారపడి ఉంది.