Shankar : క్రియేటివ్ జీనియస్ శంకర్ – మెగా పవర్‌స్టార్ రాం చరణ్ కాంబినేషన్లో ఇటీవల ఓ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శిరీష్‌తో కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం సహా మిగతా సౌత్ భాషలలోనూ ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్లో చరణ్..త్వరలో దాన్ని పూర్తి చేసి ఈ ప్రాజెక్ట్‌ని ట్రాక్‌లోకి తీసుకురానున్నాడు.
ఈ సినిమాకి మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఇందులో నటిస్తున్నట్టు ఇటీవలే అధికారకంగా మేకర్స్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లో తెలుగమ్మాయి అంజలి కూడా నటించబోతుందనే తాజా వార్త ఒకటి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తెలుగమ్మాయి అయినా ముందు తమిళ సినిమాలలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. షాపింగ్ మాల్, జర్నీ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న అంజలి తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
Shankar : ఏకంగా శంకర్ – చరణ్ ల పాన్ ఇండియన్ సినిమాలో అంజలికి అవకాశం
భారీ మల్టీ స్టారర్‌గా వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి హిట్ అందుకుంది. గీతాంజలి సినిమా, అలాగే బలుపు లాంటి హిట్ సినిమాలున్నాయి. ఆ తర్వాత ఆ స్థాయి హిట్స్ దక్కలేదు. తెలుగులో చేయడానికి వరుసగా సినిమాలు మాత్రం చేసింది. అయితే ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో మళ్ళీ బాగా ఫాంలోకి వచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా శంకర్ – చరణ్ ల పాన్ ఇండియన్ సినిమాలో అవకాశం దక్కినట్టు లేటెస్ట్ న్యూస్. ఇదే గనక నిజమైతే ఖచ్చితంగా అంజలికి ఇది గొప్ప అవకాశం అని చెప్పాలి.