Annathe : అన్నాత్తే .. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం. వరస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్న రజనీకాంత్ గత సంక్రాంతికి దర్బార్ సినిమాతో వచ్చాడు. కానీ ఈ సినిమా నిరాశపరచింది. నయనతార, నివేతా థామస్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకి ఏ.ఆర్ మురగదాస్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా అటు తమిళంలో ఇటు తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అంతక ముందు సినిమాలు కూడా వరసగా ఫ్లాపవుతూ వచ్చాయి.
కబాలి, కాలా, పేట, రోబో 2.ఓ, దర్బార్ ..ఇలా రజనీకాంత్ వరసగా సినిమాలు చేస్తున్నాడు, కానీ సాలీడ్ హిట్ మాత్రం దక్కడం లేదు. ఈ క్రమంలో కోలీవుడ్ లో అజిత్ కి బ్యాక్ టు బ్యాక్ హిట్ ఇచ్చిన మాస్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో అన్నాత్తే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో రజనీ మేకోవర్ అదిరిపోయింది. గత డిసంబర్ వరకు షూటింగ్ కూడా బాగానే సాగింది. అయితే చివరి షెడ్యూల్ హైదర్బాద్ లో జరుగుతుండగా రజనీకాంత్ అనారోగ్యం తో ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో చేరారు.
Annathe : అన్నాత్తే చివరి షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో..!
అప్పటి నుంచి అన్నాత్తే షూటింగ్ నిలిచిపోయింది. కాగా తాజాగా రజనీకాంత్ ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ చేరుకున్నట్టు సమాచారం. ఈ రోజు నుంచి అన్నాత్తే చివరి షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలవనుందట. ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేశాకే రజనీ రిటర్న్ అవుతాడని సమాచారం. కాగా ఈ సినిమాలో కీర్తిసురేష్, నయనతార హీరోయిన్లు. ఖుష్బు, మీనా, ప్రకాశ్‌రాజ్, జాకీష్రాఫ్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.