NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

TRS Party: కేసీఆర్ కి మరో పెద్ద చిక్కు.. మాజీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేసిన మహిళ..!!

TRS Party: నకిరేకల్ నియోజకవర్గ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై మరోసారి బెదిరింపుల ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా గ్రూపులలో చక్కర్లు కొడుతుంది. గత ఎన్నికల సమయంలో తమ వద్ద రూ. 10 లక్షలు అప్పుగా తీసుకున్నారని.. ఆ డబ్బులు ఇవ్వమని అడిగితే.. ఇవ్వకుండా బెదిరిస్తున్నారని ఓ మాజీ సైనికుడి భార్య తెలిపారు.

Another big complication for KCR
Another big complication for KCR

అసలు విషయమేమిటంటే?

కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన కొమ్ము కోటేష్ ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఎంపీటీసీగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. అదేసమయంలో మాజీ ఎమ్మెల్యే వీరేశం తన భార్య పేరు మీద ఉన్న ఇంటి పేపర్లను కోటేష్ దగ్గర తనఖా పెట్టి.. మాజీ జడ్పీటీసీ మాద యాదగిరికి రూ. 10 లక్షలు అప్పుగా ఇప్పించాడు. మూడు నెలల్లో మీ డబ్బులు మీకిస్తామని చెప్పిన వీరేశం.. 22 నెలలు గడిచినా డబ్బులు ఇవ్వకపోవడంతో కోటేష్ పలుమార్లు వీరేశం, మాద యాదగిరి దృష్టికి తీసుకొచ్చాడు.

TRS Party: ఇదండీ మాజీ ఎమ్మెల్యే వరుస

ఎన్నిసార్లు అడిగినా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటుండడంతో.. కోటేష్ భార్య సంధ్య బుధవారం వీరేశం ఇంటికి వెళ్లి డబ్బులు అడిగింది. అందుకు వీరేశం కోపంతో రెచ్చిపోయి.. ‘మీ డబ్బులు ఇవ్వం.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి. అసలు మీరేవరు.. మిమ్మల్ని నేను ఇప్పుడే చూస్తున్నాను. నేను మాజీ నక్సలైట్‌ను. మీ ఆయనకు నా గురించి తెలుసు. ఇబ్బంది పెడితే ఖతం చేస్తా’ అంటూ పళ్లు కొరుకుతూ తొడగొట్టి బెదిరించారని సంధ్య వాపోయింది. మరి మీ ఇంటి పేపర్లు మా దగ్గర ఎందుకున్నాయని ప్రశ్నిస్తే.. మీ ఆయన నా ఇంట్లో దొంగతనం చేశాడని వీరేశం అంటున్నాడని.. పైగా మా మీదే రిటర్న్ కేసు పెడతానని అంటున్నట్లు సంధ్య తెలిపింది. దాంతో ఎమ్మెల్యే బెదిరింపులు భరించలేకనే తన భర్త కోటేష్ ఆత్మహత్యాయత్నం చేశాడని తెలిపింది. ప్రస్తుతం కోటేష్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒక మాజీ సైనికుడికే ఇలాంటి అన్యాయం జరిగితే ఎలా అని సంధ్య పోలీసులను ప్రశ్నించారు. తన భర్తకు ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అని సంధ్య వాపోయింది. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ.. సంధ్య స్థానిక పోలీస్ స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే వీరేశం, మాజీ జడ్పీటీసీ మాద యాదగిరిపై కేసు పెట్టింది.

ఇదే మొదటిసారి కాదు

కాగా.. వేముల వీరేశం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే పలుమార్లు బెదిరింపుల ఆరోపణలు వచ్చాయి. తాజాగా వీరేశంపై మరోసారి బెదిరింపుల ఆరోపణలు రావడంతో టీఆర్ఎస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

author avatar
Yandamuri

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?