Adipurush : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న హిందీ స్ట్రైట్ సినిమా ఆదిపురుష్. ఈ సినిమాను బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత మొదలైన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా మొదలైన షెడ్యూల్ లో ప్రభాస్ తప్ప ఆదిపురుష్ లో మిగతా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న వారంతా హిందీ స్టార్సే నటిస్తున్నారు. ఇక ఆది పురుష్ షూటింగ్ లో తాజాగా మరో బాలీవుడ్ నటుడు అడుగుపెట్టాడు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, కృతి సనన్ నటిస్తున్నారు.
ప్రభాస్ రాముడిగా పాత్రలో నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ రావణునిగా, సీతగా కృతీ సనన్, లక్ష్మణ పాత్రలో సన్నీ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా తాజాగా ఇప్పుడు వత్సల్ సేత్ ఆదిపురుష్ సెట్ లో జాయిన్ అయ్యాడు. వత్సల్ సేత్ కి బుల్లి తెర, వెండి తెర మీద మంచి పాపులారిటీ ఉంది. ఇక ఇప్పటికే పలు పాత్రలతో బాలీవుడ్ లో మంచి పాపులారిటీ ఉన్న వత్సల్ సేత్ తాజాగా ఆదిపురుష్ మూవీ షూటింగ్ లో జాయిన్ అయినట్లు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. అంతేకాదు ‘న్యూ బిగినింగ్’.. అంటూ దర్శకుడు ఓమ్ రౌత్ తో ఉన్న ఫొటోను షేర్ చేశాడు.
Adipurush : ఆదిపురుష్ తో పాటు సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.
అయితే ఇందులో ఆయన పాత్ర ఏంటనేది వత్సల్ సేత్ క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే మేకర్స్ 2022 ఆగస్టు 11న అన్నీ సౌత్ భాషలలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు అధికారకంగా ప్రకటించారు. అయితే ఇప్పటికే చాలా రోజులు షూటింగ్ ఆగిపోయింది కాబట్టి అనుకున్న సమయానికి ఆదిపురుష్ రిలీజ్ అవుతుందా లేక పోస్ట్ పోన్ అవుతుందా చూడాలి. కాగా ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యాం ఈ ఏడాది రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆదిపురుష్ తో పాటు సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్నాడు.