NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్ , జ‌గ‌న్ ఒకే టీం అంటూ …టీడీపీ ఏం చేస్తుందో తెలుసా?

రాజ‌కీయాలు ఎంతో చిత్ర‌మైన‌వి. అంతు చిక్క‌ని ప‌రిణామాల‌కు పాలిటిక్స్ కేరాఫ్ అడ్ర‌స్ . అదే రీతిలో అయోమ‌యం క‌లిగించే విమ‌ర్శ‌లు , ప్ర‌తి విమ‌ర్శ‌ల‌కు సైతం అదే రాజ‌కీయాలు చిరునామా.

 

అలాంటి రాజ‌కీయాల్లో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మీద తాజాగా వ‌చ్చిన విమ‌ర్శ . ఇంకా చెప్పాలంటే గ‌తంలో వ‌చ్చిన విమర్శే తాజాగా కూడా వ‌చ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఏపీ సీఎం వైఎస్ జగన్ లాలూచీ పడ్డారని టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

సీఎం జ‌గ‌న్‌పై ఇంకో ఆరోప‌ణ‌

బహుళార్థకసాధక ప్రాజెక్టు, 13 జిల్లాలకు వరప్రసాదిని అయిన పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్ మోహన్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం, కేసుల మాఫీ కోసం పక్క రాష్ట్రాలతో రాజీపడి రైతులకు ఉరితాడు వేస్తున్నారు అని సంచ‌లన ఆరోప‌ణ‌లు చేశారు. “పోల‌వ‌రం ప్రాజెక్టుకు గ్రహణం పట్టిస్తున్నారు. పనులు నత్తనడకన సాగుతున్నాయి. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు పోలవరం గురించి మాట్లాడుతుంటే.. టేపు తెచ్చుకోవాలని ఇరిగేషన్ మంత్రి మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును 18 నెలలుగా పట్టించుకోవడం లేదు. పోలవరం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పనులు ఎందుకు ఆపేశారని పోలవరం లెఫ్ట్ కెనాల్, పురుషోత్తమపట్నం ఉండగా.. విశాఖకు పైప్ లైన్లు వేస్తామని మాట్లాడుతున్నారు. పైప్ లైన్లలో ఎంత కమీషన్లు మాట్లాడుకున్నారు? “ అంటూ విరుచుకుప‌డ్డారు.

కేసీఆర్ తో …

పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు ఎందుకు పరిగెత్తడం లేదు. పురుషోత్తం పనులు ఎందుకు ఆగిపోయాయి? మోటార్లు ఎందుకు ఆన్ చేయలేదు? రెండేళ్లు మేం నడిపించి చూపించాం. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రితో ఎందుకు లాలూచీపడ్డారు? చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకుండా ఢిల్లీ వెళ్లి, ప్రధానిని ఒప్పించి 7 ముంపు మండలాలను ఏపీలో కలిపి పోలవరం కలను సాకారం చేయడం జరిగింది. సీలేరు, శబరి, జల విద్యుత్ ప్రాజెక్టు వల్ల గోదావరి డెల్టాలో రెండో పంటకు ఇబ్బంది లేకుండా ఐదారేళ్లుగా బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి. ఇవాళ సీలేరు, శబరి, 7 ముంపు మండలాలను గాలికి వదిలేశారు. ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేకపోతున్నారు. ఎవరికి వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. 11న జరిగిన రివ్యూ మీటింగ్ లో, మీ అధికారులు ఇచ్చిన నోట్ లో 41.15 మీటర్లకే భేసకరణ, ల్యాండ్ అక్విజేషన్, డ్యాం పనులు చూస్తామని చెప్పారు. డ్యాం ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించేందుకు మీరు రాజీపడ్డారు. 150 అడుగులు కట్టాల్సిన డ్యాంను 135 అడుగులకే భూసేకరణ, పరిహారంకు రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైంది. దీంతో 5 కోట్ల ప్రజలు ఆందోళనలో ఉన్నారు.“ అంటూ దేవినేని ఉమ ప్ర‌శ్నించారు.

ఇంకో ఆరోప‌ణ‌

పోల‌వ‌రం ప్రాజెక్టుకు ఎవరెంత ఖర్చుపెట్టారో దమ్ముంటే బయటపెట్టాలని దేవినేని ఉమా స‌వాల్ విసిరారు. “హైదరాబాద్ లో ఆస్తుల కాపాడుకునేందుకు కేసీఆర్ తో లాలూచీ పడి సీలేరు, శబరిని తాకట్టు పెట్టే హక్కు జగన్ కు లేదు. వీటిపై సమాధానం చెప్పాలి. వైఎస్, జగన్ పాపాల వల్ల పోలవరంలో నష్టపోయింది రూ.10వేల కోట్లు. జగన్ నోరు తెరవాలి. “ అని ఉమామ‌హేశ్వ‌ర రావు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ చేసిన ఈ ఘాటు విమ‌ర్శ‌ల‌పై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి మ‌రి.

author avatar
sridhar

Related posts

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju