Bigg Boss 5 Telugu: యాంకర్ రవి విషయంలో జాగ్రత్త పడ్డా మరో కంటెస్టెంట్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో నటరాజ్ మాస్టర్ పెట్టిన గుంటనక్క టైటిల్ కి తగ్గ రీతిలో నే యాంకర్ రవి వ్యవహారం ఉందని బయట జనాలు అంటున్నారు. అదే సమయంలో ఇంటిలో ప్రతి సారి నటరాజ్ మాస్టర్ దగ్గర మీరు నన్ను ఉద్దేశించే గుంట నక్క అని అన్నారు అంటూ ప్రతిసారి ఆయన దగ్గర డిస్కషన్ పెట్టడంతో.. రవి తనకి తానుగా గుంటనక్క అని ఒప్పేసుకున్నాడు అని బయట జనాలు భావిస్తున్నారు. మరోపక్క ప్రతి వీకెండ్ ఈ గుంట నక్క ప్రస్తావన నాగార్జున తీసుకురావడంతో పాటు అదే సమయంలో హౌస్లో సభ్యులంతా రవి వైపు చూస్తూ ఉండటం తో.. ఎంతో క్రేజ్ ఉన్న రవి పరిస్థితి… చెప్పుకోలేని విధంగా మారిపోయింది.

సోమవారం జరిగిన ఎపిసోడ్ లో ఇదే ప్రస్తావన తీసుకు వచ్చే ప్రతి సారి మీరు గుంటనక్క అంటే అవతల సభ్యుల తన వైపే చూస్తున్నారని అసలు ఎవరు ..?, నేను కాదు అని కెమెరాల ముందు చెప్పేయండి.. అంటూ రవి నటరాజ్ మాస్టర్ పై బలవంతపు ఒత్తిడి తీసుకురాగా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఉంది నువ్వు కాదన్నప్పుడు ఎందుకు నీకు ఎంత కంగారు అంటూ పరోక్షంగా అతడే అన్న తరహాలో… తెలివిగా సమాధానమిచ్చాడు. చాలావరకు హౌస్ లో ఎంట్రీ ఇచ్చాక రవి గేమ్.. చూస్తే ఇతరులను ఇన్‌ఫ్లూయెన్స్‌ చేసేవిధంగా ఆడుతున్న సంగతి తెలిసిందే. లహరి విషయంలో కలుగజేసుకుని ప్రియా నీ బ్యాడ్ చేయగా అంతకుముందే, ప్రియా దగ్గర లహరి ని బ్యాడ్ చేస్తూ.. యాంకర్ రవి ఇష్టానుసారంగా మాట్లాడారు. దీంతో ఈ పరిణామాలు మూడవ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో హగ్ గొడవలో బయటపడగా ప్రియా చేసిన వ్యాఖ్యలు.. అట్ల ఇంట్లో సభ్యులంతా ఒక్కసారిగా సీరియస్ అయి పోయారు.

అంతకుముందే జాగ్రత్తపడే కాజల్…

ఆ సమయంలో.. అమ్మతోడు సింగిల్ మేం అనే పదాన్ని వాడలేదు…అంటూ ప్రియ దగ్గర తల్లిపై కూడా అబద్దాలు చెబుతూ అడ్డంగా బుక్కయ్యాడు వీడియో లో రవి. దీంతో మూడవ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఈ హగ్ గొడవ ఎపిసోడ్ మొత్తానికి లహరి ఎలిమినేట్ అయిపోయింది. ఈ మొత్తం దెబ్బతో ఇంటి సభ్యులు రవి విషయంలో జాగ్రత్త పడుతూ వస్తున్నారు. నాలుగో వారం ఎలిమినేషన్ నామినేషన్ అయిపోయిన తర్వాత ఆర్ జే కాజల్..నీ.. నామినేట్ చేసిన తర్వాత ఆమెను కూల్ చేయడానికి.. వెళ్ళిన టైములో చెత్త రీజన్ చెప్పి ఆమెను నామినేట్ చేయడంతో ఆమె మొత్తం రవి కన్నింగ్ అని తిరిగి తనతో మాట్లాడొద్దని, తన నీ ఫ్రెండ్ అనొద్దు అని.. రవి మొహం పైన చెప్పేసింది.

రవి నీ వల్ల జెస్సి ఇన్‌ఫ్లూయెన్స్‌…

ఇదిలా ఉంటే బుధవారం ఎపిసోడ్ లో.. చాలా సైలెంట్ గా షణ్ముఖ్ జస్వంత్ వద్దకు వచ్చి.. కన్వర్జేషన్ మొదలుపెడదాం అనుకున్న రవి కి ఊహించని రీతిలో.. షణ్ముఖ్ జస్వంత్ .. రవి.. కి తనతో మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఒక్కసారిగా రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. నీవల్ల టాస్క్ లలో ఇన్‌ఫ్లూయెన్స్‌ అవుతున్నాను బ్రో అని చెప్పుకొచ్చాడు. ఇక ఇదే సమయంలో రవి నీ వల్ల జెస్సి ఇన్‌ఫ్లూయెన్స్‌… అవుతున్నాడు అంటూ రివర్స్ కౌంటర్ ఇవ్వగా వాడే నాకు… సజెషన్స్ ఇస్తున్నాడని షణ్ తెలిపాడు. అదే సమయంలో షణ్ముఖ్ జస్వంత్ దగ్గర్నుండి రవి వెళ్ళిపోతే అసలు నీతో ఇప్పటివరకూ హౌస్ లో పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు అయినా గాని.. నావల్ల ఇన్‌ఫ్లూయెన్స్‌ అవ్వడం ఏంటో అర్థం కావడం లేదంటూ అయోమయంగా గందరగోళపు వ్యాఖ్యలు చేస్తూ మెల్లగా సైలెంట్గా పక్క కి వెళ్ళాడు రవి. ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్ లో.. హగ్ గొడవ జరిగిన తర్వాత లహరి ఎలిమినేట్ అయ్యాక… రవి విషయంలో లో చాలా మంది.. జాగ్రత్త వహిస్తున్నారు అంటూ బయట జనాలు సోషల్ మీడియాలో తెగ డిస్కషన్లు చేస్తున్నారు. ఈవారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ అయిన తర్వాత ఆర్జే కాజల్, తర్వాత ఇప్పుడు షణ్ముఖ్ జస్వంత్.. రవి విషయంలో చాలా తెలివిగా వ్యవహరించారని చెప్పుకొస్తున్నారు.


Share

Related posts

వైసిపిపై జనసేన గరం

somaraju sharma

ఏపీ లో ఆగస్టు 3 నుండి స్కూళ్ళు.. 30% సిలబస్ కట్, ఇంకా మరెన్నో మార్పులు….

arun kanna

పవన్ కళ్యాణ్ నటించిన రీమేక్ సినిమాలు ఇవే..!

Teja