దేశంలో మరో మంకీ పాక్స్ కేసు .. కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్రం

Share

ప్రపంచ దేశాలను కలవరానికి గురి చేస్తున్న మంకీ పాక్స్ కేసులు మన దేశంలోనూ విస్తరిస్తుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే కేరళలో ఒక మంకీ పాక్స్ కేసు నమోదు కాగా, అదే రాష్ట్రంలోని కాన్నురు జిల్లాలో తాజాగా రెండో కేసు వెలుగు చూసింది. కన్నూరు జిల్లాకు చెందిన 31 ఏళ్ల వ్యక్తికి మంకీ పాక్స్ సోకినట్లు కేరళ అధికారులు ప్రకటించారు. ఇతను ఈ నెల 13న దుబాయి నుండి కర్ణాటక లోని మంగళూరు విమానాశ్రయానికి వచ్చాడు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో కేరళలోని కన్నూరుకు చేరుకున్నాడు, రెండు రోజుల క్రితం చర్మంపై దద్దుర్లు కనిపించడంతో స్థానిక ఆసుపత్రికి వెళ్లాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు మంకీ పాక్స్ లక్షణాలుగా ఉండటంతో అప్రమత్తమై శాంపిల్స్ సేకరించి పుణె లోని వైరాలజీ ల్యాబ్ కు పంపించారు.

 

అతనికి మంకీ పాక్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అతనికి కన్నూరు జిల్లా పరియారం వైద్య కళాశాలలో చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, ఆ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారిపై దృష్టి పెట్టినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఇప్పటికే కేరళలోని కొల్లాం జిల్లాలో తొలి మంకీ పాక్స్ కేసు నమోదు అయ్యింది. ఇప్పుడు తాజాగా మరో కేసు వెలుగు చూడటంతో కేంద్రం అప్రమత్తమైంది. సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.

విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులకు హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు మరింత కఠినంగా నిర్వహించాలని విమానాశ్రయాలు, నౌకాశ్రయాల అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశానికి విమానాశ్రయాలు, ఓడ రేవుల ఆరోగ్య అధికారులు, ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ లు హజరయ్యారని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో మంకీ పాక్స్ వ్యాధిని కట్టడి చేసేలా అంతర్జాతీయ ప్రయాణీకులందరికీ కఠిన ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా చూడాలని ఆదేశించినట్లు తెలిపింది.


Share

Recent Posts

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…

2 నిమిషాలు ago

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

27 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

1 గంట ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

1 గంట ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago