యూట్యూబ్ లో మరో రికార్డు సొంతం చేసుకున్న “RRR”..!!

బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్నా “RRR” పై దేశ వ్యాప్తంగా అంచనాలు ఓ రేంజిలో ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా పిరియాడిక్ డ్రామా తరహాలో స్వాతంత్ర పోరాట నేపథ్యంలో ఫిక్షన్ స్టోరీతో రాజమౌళి ఫస్ట్ టైం ఎన్టీఆర్ చరణ్ తో కలిసి చేస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

Title of Rajamouli's 'RRR' announced | The News Minuteఈ సినిమా కోసం ఇద్దరూ బలంగా బాడీ ని పెంచడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి రామ్ చరణ్ బర్త్ డే నాడు సరిగ్గా లాక్డౌన్ సమయంలో ‘భీమ్ ఫర్ రామరాజు’ స్పెషల్ వీడియో రిలీజ్ చేయడం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ వాయిస్ అందించిన ఈ వీడియోకి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత రిలీజ్ అయిన ఎన్టీఆర్ వీడియో కి రామ్ చరణ్ వాయిస్ అందించగా..రామరాజు ఫర్ భీమ్ టీజర్ యూట్యూబ్ లో రికార్డులు బ్రేక్ చేస్తోంది.

 

ఇప్పటికే 39మిలియన్ల పైగా వ్యూస్ సొంతం చేసుకున్న ఈ వీడియో 11.6 లక్షల కామెంట్స్ దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కామెంట్స్ చేయబడిన వీడియోగా ఎన్టీఆర్ టీజర్ రికార్డు నమోదు చేసింది. ఇదిలాఉంటే ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్” టీజర్ రిలీజ్ అవగా.. అది ఎన్టీఆర్ నటించిన టీజర్ రికార్డులు బద్దలు కొడుతుందని అందరూ భావించగా.. రెండో స్థానానికి పరిమితమైంది. దీంతో యూట్యూబ్ లో “RRR” అనేక వ్యూస్ తో పాటు కామెంట్లు రాబడుతున్న టీజర్ గా..రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంది.