Daring Women: లైంగిక వేధింపుల పర్వం లో మరో పార్శ్వం!ఓ చెల్లీ.. నీ ధైర్యానికి జేజేలు!!

Share

Daring Women: తనను వేధిస్తున్న నెల్లూరు గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ జొన్న ప్రభాకర్ తో ఒక మహిళా హౌస్ సర్జన్ ఫోన్లో మాట్లాడిన తీరు స్త్రీ లోకానికి కొత్త ప్రేరణ ఇస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రభాకర్ ఆమెను వేధించిన తీరు ఒక ఎత్తయితే ఈ హౌస్ సర్జన్ ఆయన్ని నిలదీసిన తీరు మరో ఎత్తు.ఏమాత్రం జంకు బొంకు లేకుండా డోంట్ కమ్ ఇన్ మై వే అని ఆమె డాక్టర్ ప్రభాకర్ కు వార్నింగ్ ఇవ్వటం అనేది హైలైట్.ఆ హౌస్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్ ల మధ్య జరిగిన ఆడియో టేపు మొత్తం వింటే ఏ విధంగా ఆమె బరస్టయిందీ అర్థమవుతోంది.

Another side of the sexual harassment scandal!
Another side of the sexual harassment scandal!

ఫోన్లో సాగిన సంభాషణ ఇదీ!

ముందుగా ప్రభాకర్ మహిళా హౌస్ సర్జన్లు మధ్య వృత్తిపరమైన సంభాషణ సాగింది.ఆమె ఏదో డ్యూటీకి సంబంధించి అడగడం ఆయన వివరణ ఇవ్వడం జరిగింది.ఆ తర్వాతే అసలు సంభాషణ మొదలయింది.ఇప్పటివరకు మాట్లాడు మాట్లాడు అంటున్నారు కదా ఇప్పుడు మాట్లాడుతున్నా వినండి అంటూ ఆ మహిళా హౌస్ సర్జన్ సంభాషణ ప్రారంభించి డాక్టర్ ప్రభాకర్ ను దులిపిపారేసింది.ఇప్పటివరకు ఆయన కారణంగా తనకెదురైన చేదు అనుభవాలన్నింటిని ఆమె ఫోన్లో ప్రస్తావించింది.”నీకు ఏసీ లేదు నా గదిలో ఏసీ ఉంది రా “అంటూ పిలవడం ఏమిటని నిలదీసింది.”నా చేతులు కాళ్లు కట్టేసి కారులో వేసుకుని తీసుకుపోతానంటావా “అంటూ మండిపడింది.”పార్క్ కు రమ్మని అడుగుతావా” అంటూ ప్రశ్నించింది.”నన్నేమైనా రోడ్ సైడ్ రోమియో అనుకుంటున్నావా?నన్ను ఎందుకు దూరంగా పెడుతున్నావు” అంటూ తనతో ప్రభాకర్ వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావిస్తూ మీ కన్నా రోడ్డు సైడ్ రోమియోలు చాలా బెటర్. ఒక కామెంట్ చేసి వెళ్లిపోతారు. మీలాగ వేధించరని ఆ మహిళా హౌస్ సర్జన్ అతనికి సమాధానం ఇచ్చింది.

Read More: Covid Hospital: ఏపీ ప్రభుత్వం అద్భుతం..! 15 రోజుల్లోనే కోవిడ్ ఆసుపత్రి నిర్మాణం

Daring Women: నా వయసున్న కూతురు నీకు లేదా?

నా వయసు కేవలం ఇరవై మూడు సంవత్సరాలు సార్.నాకు తెలిసి మీకు నా అంత వయసున్న కూతురు ఉండే ఉంటుంది.ఇలాగే మీ కూతురితో మీలాగే అరవయ్యేళ్ళ ముసలోడు మాట్లాడితే మీరేం చేస్తారు?వాడికే ఇచ్చి పెళ్లి చేస్తావా అంటూ ఆ మహిళా హౌస్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్కి గడ్డి పెట్టింది.ఒక సందర్భంలో ఇవన్నీ కామన్ అని డాక్టర్ ప్రభాకర్ చెప్పగా మీకు కామనేమో మా ఇంట్లో కాదంటూ గర్జించింది.”నా జోలికి రావద్దు .నన్ను ఇబ్బంది పెట్టనంతవరకు నేను మామూలుగా వుంటాను.ఇప్పటికే విసిగిపోయాను.ఇంకేమైనా మీరు చేస్తే చాలా దూరం విషయం వెళుతుంది. పెద్దపెద్ద గొడవలైపోతాయి అని ఆమె ఆయనకు వార్నింగ్ కూడా ఇచ్చింది. ఉన్నత స్థాయిలో ఉన్న వారు కింది స్థాయి వారిని లైంగికంగా వేధించడం రొటీన్ వార్త.కానీ ఈ తరహాలో ఒక మహిళ అతడికి ఎదురు తిరగడం అన్నది మాత్రం అసాధారణమైన వార్త.ప్రతి మహిళ ఇలా ధైర్యాన్ని పుంజుకుంటే కామాంధులకు చుక్కలు కనిపిస్తాయి అనడంలో సందేహమే లేదు.

 


Share

Related posts

షేక్ హసీనా ప్రమాణ స్వీకారానికి విపక్షాల గైర్హాజర్

Siva Prasad

Pawan Kalyan : స్క్రిప్ట్ పట్టుకొచ్చిన డైరెక్టర్ – ‘అవి’ మార్చుకురమ్మని పంపించేసిన పవన్ కల్యాణ్ ? 

arun kanna

65000కోట్ల సినిమా : జగన్ ని ఒక్కమాట అనకుండా .. బుగ్గన ని టోటల్ టార్గెట్ చేస్తున్నారు .. !

sekhar