NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Madhya Pradesh: చెంప చెళ్లు మనిపించడమే ఐఎఎస్ అధికారుల పనా..! మధ్యప్రదేశ్‌లో మరో ఐఎఎస్ నిర్వాకం వీడియో వైరల్..!!

Madhya Pradesh: సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైనా లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘిస్తే జరిమానా విధించడం లేక పోతే కేసు నమోదు చేయడం లాంటివి చేయాలి. కానీ సాధారణ పోలీసుల మాదిరిగా ఇటీవల ఉన్నత స్థాయి అధికారులైన ఐఎఎస్‌ లు  వ్యక్తులపై చేయి చేసుకుంటున్నారు. చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని సూరజ్ పుర్ జిల్లా కలెక్టర్ రణ్ వీర్ శర్మ లాక్ డౌన్ సమయంలో బయటకు వచ్చాడని ఓ వ్యక్తి చెంప చెళ్లు మనిపించి ప్రభుత్వ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. అక్కడి ఐఎఎస్ అధికారులు సైతం ఆ కలెక్టర్ చర్యలను ఖండించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి స్పందించి కలెక్టర్ పై చర్యలు తీసుకున్నారు. జరిగిన ఘటనపై కలెక్టర్ శర్మ తరువాత ఆ వ్యక్తికి క్షమాపణ కూడా చెప్పారు.

another slap ias manjusha vikrant rai slaps shopkeeper alleges lockdown violation in Madhya Pradesh 
another slap ias manjusha vikrant rai slaps shopkeeper alleges lockdown violation in Madhya Pradesh

ఈ ఘటన మరువక ముందే మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. లాక్ డౌన్ సమయంలో దుకాణం తీశాడని ఓ షాపు యజమానిపై షాజాపూర్ అదనపు కలెక్టర్ మంజూష విక్రాంత్ రాయ్ చేయి చేసుకున్నారు. విధంగా జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ మహిళా ఐఎఎస్ అధికారి ఆ వ్యక్తి చెంప చెళ్లు మనిపించడం, ఆ వెంటనే ఓ కానిస్టేబుళ్ల లాఠీతో కొట్టడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

another slap ias manjusha vikrant rai slaps shopkeeper alleges lockdown violation in Madhya Pradesh 
another slap ias manjusha vikrant rai slaps shopkeeper alleges lockdown violation in Madhya Pradesh

 

 

Read More: Chhattisgarh: ఓ వ్యక్తికి చెంప చెళ్లుమనిపించిన కలెక్టర్ కు గూబగుయ్ మనిపించిన సీఎం..!!

ఈ ఘటనపై ఆ రాష్ట్ర మంత్రి సింగ్ పర్మార్ స్పందించారు. ఆ అదనపు కలెక్టర్ చర్యలను మంత్రి తప్పుపట్టారు. అవసరం అయితే సదరు అధికారిణిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఉన్నత స్థాయి అధికారులే ఈ విధంగా వ్యక్తులపై చేయి చేసుకుంటే దిగువ స్థాయి సిబ్బంది ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఓ పక్క ఇటువంటి ఘటనలను ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకంటూ అధికారులపై యాక్షన్ తీసుకుంటున్నా వారిలో మార్పు రాకపోవడం శోచనీయం. ఇటువంటి చర్యలను ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N