పశ్చిమగోదావరి జిల్లాలో మరో వింత వ్యాధి..!!

గత ఏడాది పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలో వింత వ్యాధి చోటుచేసుకుని కేవలం ఒక్కరోజులో దాదాపు 500కు పైగా కేసులు రావడం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల కి చెమటలు పట్టించినటు అయింది. ఒకపక్క కరోనా వైరస్ ని ఎదుర్కొంటున్న సమయంలో.. ఏలూరు నగరంలో అసలు దేనికి మనుషులు ఊరికినే కళ్లు తిరిగి పడిపోవడం, మూర్చ రోగంతో హాస్పిటల్ లో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు… జాయిన్ అవ్వడం జరిగింది.

Over 300 ill with unknown disease in Andhra's Eluru, Central team to probe  | India News,The Indian Expressఈ దెబ్బతో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ తో పాటు కేంద్ర ప్రభుత్వ బృందాలు అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు కూడా ఏలూరులో ఈ వింత వ్యాధికి గల కారణం ఏమిటి అన్నదానిపై రకరకాల పరిశోధనలు జరిపి.. చివరాకరికి కూరగాయలలో అదేవిధంగా నీటిలో కాలుష్యం ఉన్నట్లు తేల్చారు.

 

ఇదిలా ఉంటే మరో సారి పశ్చిమగోదావరి జిల్లాలో ఇదే రీతిలో కొంతమంది పడిపోవటం మరింత సంచలనంగా మారింది. మేటర్ లోకి వెళ్తే పశ్చిమగోదావరి జిల్లా గ్రామాలకు చెందిన ప్రజలు ఉన్నట్టుండి పడిపోవటం తో పాటు మూర్ఛ వచ్చి పడిపోవటం తో దాదాపు పది మందికి పైగా ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం అందరికీ టెన్షన్ పుట్టిస్తుంది. కారణం లేకుండా ప్రజలు ఈ విధంగా పడిపోవడంతో ప్రభుత్వాల పై విమర్శలు వస్తున్నాయి. గతంలో 600 మంది జాయిన్ అయితే ఈ సారి అదే లక్షణాలతో ఇటీవల రెండు రోజుల నుండి పది మందికి పైగా పడిపోవడంతో వైద్యులు కూడా అసలు కారణం ఏంటో అని ఆరా తీస్తున్నారు.