RRR : ఆర్ఆర్ఆర్ సినిమా గురించి దేశ వ్యాప్తంగానే కాదు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం దర్శక ధీరుడు రాజమౌళి.. మెగా పవర్ స్టార్ రాం చరణ్… యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. ఈ కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ నుంచి ఇప్పటికే కొన్ని సర్ప్రజెస్ వచ్చి తారా స్థాయిలో అంచనాలు పెంచాయి. భీం ఫర్ రామరాజు దగ్గర్నుంచి మొదలుకొని.. రామరాజు ఫర్ భీం..టీజర్స్.. ఆ తర్వాత ఆర్ ఆర్ ఆర్ ఆన్ లొకేషన్ అప్డేట్స్ తో రాజమౌళి బృందం బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజెస్ ఇస్తూనే ఉన్నారు.
ఇక రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పోషిస్తున్న సీత పాత్రని రివీల్ చేశారు. ఇలా అంచనాలకి మించి ఆర్ ఆర్ ఆర్ ని తెరకెక్కిస్తున్న రాజమౌళి తాజాగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ బర్త్ డే సందర్భంగా సీతారామరాజు ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్ మరో రేంజ్ లో ఆర్ ఆర్ ఆర్ మీద అంచనాలు పెంచింది. సీతారామరాజు ఇలా ఉంటే మే 20న తారక్ బర్త్ డే సందర్భంగా భీం ఫస్ట్ లుక్ ని ఎలా రివీల్ చేయబోతున్నాడో అని అందరూ భావిస్తున్నారు.
RRR : ఆర్ఆర్ఆర్ బృందం అజయ్ దేవగన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారట.
కాగా అంతకన్న ముందే ఇంకా చెప్పాలంటే మరో మూడు రోజుల్లో ఆర్ ఆర్ ఆర్ నుంచి మరో సర్ప్రైజ్ సిద్దమవుతోందట. ఆరోజు విశేషం ఏమిటంటే ఆర్ఆర్ఆర్ లో కీలక పాత్రలో కనిపించబోతున్న బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్ రిలీజ్ కానుందని సమాచారం. ఏప్రిల్ 2న అజయ్ దేవగన్ పుట్టిన రోజు కావడంతో ఆర్ఆర్ఆర్ బృందం అజయ్ దేవగన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారట. ఇక ఈ సినిమాలో అజయ్ దేవగన్ రామరాజు – భీం లకి గురువుగా కనిపిస్తాడని సమాచారం.