న్యూస్

“RRR”తో పాటు ఆస్కార్ బరిలో మరో తెలుగు సినిమా..??

Share

తెలుగు సినిమా రంగం స్థాయి పెరిగిన సంగతి తెలిసిందే. దర్శకుడు రాజమౌళి పుణ్యమా టాలీవుడ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గిరాకీ ఏర్పడింది. “బాహుబలి 2”, “RRR” లతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఏకైక దర్శకుడిగా రాజమౌళి రికార్డ్ సృష్టించడం తెలిసిందే. ఈ రెండు సినిమాలు తెలుగు నటీనటులతో తెరకెక్కడంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలకు మంచి ప్రాధాన్యత లభించడం జరిగింది. ఈ క్రమంలో ఇటీవలే రాజమౌళి తెరకెక్కించిన “RRR” ఆస్కార్ బరిలో నిలిచినట్లు వార్తలు వచ్చాయి.

Another Telugu movie in Oscar race..

అమెరికా ప్రముఖ మీడియా వెరైటీ అనే మ్యాగజిన్ సంస్థ RRR ఆస్కార్ బరిలో ఉన్నట్లు బెస్ట్ యాక్టర్ గా తారక్ రేసులో ఉన్నట్లు లిస్టు ప్రకటించడం కొద్ది రోజుల క్రితం సోషల్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరొక సినిమా ఆస్కార్ బరిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి నటించిన “శ్యామ్ సింగరాయ” ఆస్కార్ నామినేషన్ లో ఉన్నట్లు సరికొత్త వార్త వినబడుతోంది.

Another Telugu movie in Oscar race..

రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసికల్ కల్చరల్… డాన్స్, పిరియాడికల్ ఫిల్మ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ విభాగాల్లో ఆస్కార్ బరిలో ఎంపికైనట్లు టాక్ నడుస్తోంది. ఏదో ఒక విభాగానికి ఆస్కార్ వచ్చిన టాలీవుడ్ ఖ్యాతి ప్రపంచానికి మరోసారి తెలుస్తుందని తాజా వార్తపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఏది ఏమైనా ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ రేసులో తెలుగు సినిమాలు ఉన్నట్లు వార్తలు రావడం నిజంగా టాలీవుడ్ స్థాయి పెరిగింది అని చెప్పవచ్చు.


Share

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్..!!

bharani jella

తెలుగు రాష్ట్రాల బీజేపీ ఇన్ఛార్జిల మార్పు దేనికి సంకేతం?

Yandamuri

Intinti Gruhalakshmi: అనుకున్నంత అయిపోయిందిగా..నందు – లాస్యల హనీమూన్! ఆనందంలో లాస్య… దుఃఖంలో తులసి..!!

Ram