బులంద్‌షహర్ కేసులో బిజెపి నేత అరెస్టు

లక్నో, జనవరి 10: ఉత్తర్ ప్రదేశ్‌, బులంద్‌షహర్ పోలీసు అధికారి సుబోధ్ కుమార్‌సింగ్ హత్య కేసులో మరో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు శిఖర్ అగర్వాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. బులంద్‌షహర్ నుండి 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న హపూర్ పట్టణంలో అతను బుధవారం రాత్రి పట్టుబడ్డాడు.
గత వారం ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా భావిస్తున్న భజరంగ్ దళ్ కార్యకర్త యోగేష్ రాజ్ పట్టుబడ్డాడు. ఇదే కేసులో నిందితులుగావున్న కలువా, ప్రశాంత్ నట్‌లు ఇప్పటికే రిమాండ్ ‌లో ఉన్నారు.
గత ఏడాది డిసెంబరు మూడున బులంద్‌షహర్ గ్రామంలో గోహత్యకు సంబంధించి హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ ఘర్షణల్లో పోలీసు అధికారి సుభోధ్ సింగ్‌ను గొడ్డలితో నరికి తుపాకితో కాల్చి చంపారు.