ANR: అక్కినేని నాగేశ్వర రావు కెరీర్‌లో నాన్ స్టాప్‌గా 365 రోజులు ప్రదర్శింపబడి రికార్డ్ క్రియేట్ చేసిన ఒకే ఒక్క సినిమా అదే

Share

ANR: తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ మూల స్థంభంగా నిలిచిన గొప్ప నటుడు అక్కినేని నాగేశ్వర రావు. నాటకరంగం నుంచి చిత్రపరిశ్రమలోకి వచ్చి దాదాపు 75 సంవత్సరాలు హీరోగా, పలు ముఖ్యపాత్రల్లో నటించారు. కమర్షియల్ సినిమాకి కొత్త అర్థం చెప్పిన నటుడు ఏ.ఎన్.ఆర్. నటుడిగానే కాక, నిర్మాతగా స్టూడియో యజమానిగా ఎన్నో బాధ్యతలు నిర్వహించారు. భారతీయ సినిరంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకిచ్చే రెండవ పెద్ద పురస్కారం అందుకున్న హీరో కావడం విశేషం. ఆ కాలంలో ప్రేమకథా చిత్రాలకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అక్కినేని నాగేశ్వరరావు ఎక్కువగా ప్రయోగాలు చేశారు.

anr-that one movie created record of 365 days non stop in his career
anr-that one movie created record of 365 days non stop in his career

9 ఏళ్ళ నుంచి 18ఏళ్ల వరకు అంటే 9 ఏళ్లు నాటకాలు వేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఎక్కువగా నాటకాలలో అక్కినేని స్త్రీ పాత్రలు పోషించారు. అలా నాటక రంగం నుంచి 1941 లో పి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ధర్మపత్ని చిత్రం ద్వారా నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమయ్యారు. 1944 లో ఘంటసాల బలరామయ్య తెరకెక్కించిన ‘సీతారామ జననం’ సినిమాలో హీరోగా మారారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి 256 సినిమాల్లో నటించారు అక్కినేని. సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి తనకి తానే సాటిగా నిలిచారు. ఈ క్రమంలో అక్కినేనికి స్టార్ స్టేటస్ దక్కింది. దాంతో నటసామ్రాట్ బిరుదు సాధించారు. ఎన్.టి.ఆర్, ఎస్.వీ.అర్. లాంటి అగ్ర హీరోలతో ఎన్నో అద్భుతమైన మల్టీస్టారర్ సినిమాలు చేశారు.

ANR: తెలుగు సినిమాలలో ద్విపాత్రాభినయనానికి నాందిపలికిన హీరో అక్కినేని

కెరీర్ ప్రారంభం నుంచే అక్కినేని తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తూ ఊపిరాడనంతగా సినిమాలు చేశారు. కనీసం 4 గంటలు కూడా నిద్రపోకుండా చేసిన సినిమాలెన్నో ఉన్నాయి. ఏ ఎన్ ఆర్ నటనా ప్రస్థానంలో ఎన్నో మరపురాని చిత్రాల్లో తనకు మాత్రమే సాధ్యమయ్యే నటనతో..ఆయన తప్ప ఆ పాత్ర మరే అగ్ర కథానాయకుడు చేయలేనటువంటి సినిమాలు చేసి ఆబాలగోపాలన్ని అలరించారు. అక్కినేని కెరీర్ లో 1953 లో వచ్చిన దేవదాసు చిత్రంతో ప్రేమికుడిగా తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తెలుగు సినిమాలలో ద్విపాత్రాభినయనానికి నాందిపలికిన అక్కినేని, 1966 లో విడుదలైన నవరాత్రి సినిమాలో 9 పాత్రల్లో నటించడం..ప్రతీ ఒక్కరినీ మెప్పించడం అంటే పెద్ద సాహసం.

ANR: కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా సామాజిక అంశాలతోనూ అక్కినేని అద్భుతమైన సినిమాలు చేశారు.

ప్రేమ నగర్, దసరా బుల్లోడు, మాయాబజార్, భూకైలాస్, శ్రీకృష్ణార్జున యుద్ధం, మిస్సమ్మ, ప్రేమించు చూడు లాంటి విభిన్నమైన చిత్రాలలో రక రకాల పాత్రలతో అలరించారు. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా సామాజిక అంశాలతోనూ అక్కినేని అద్భుతమైన సినిమాలు చేశారు. సంసారం, ఆరాధన, డాక్టర్ చక్రవర్తి, అర్థాంగి, మాంగల్యబలం, దసరా బుల్లోడు, భార్యాభర్తలు, ధర్మదాత, బాటసారి వంటి సినిమాలు ఆక్కినేనికి మైల్ స్టోన్ మూవిస్. ఇక మేఘసందేశం అక్కినేని కెరీర్ లో మరో గొప్ప సినిమాగా నిలిచిపోతుంది.

ఇక దర్శకరత్న దాసరి నారాయణరావు రూపొందించిన ప్రేమాభిషేకం హైదరాబాదులో 533 రోజులు ప్రదర్శించబడి తెలుగుసినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. నాన్ స్టాప్‌గా 365 రోజులు ప్రదర్శింపబడిన సినిమాల్లో ఒకే ఒక్క తెలుగు సినిమాగా ప్రేమాభిషేకం రికార్డ్ క్రియేట్ చేసింది. అన్నపూర్ణ బ్యానర్ లో వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమాభిషేకం కావడం విశేషం. 1991 లో అక్కినేని నటజీవితం స్వర్ణోత్సవం సందర్భంగా విడుదలైన సీతారామయ్య గారి మనమరాలు భారీ చిత్రాలతో పోటీపడి బాక్సాఫీసు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అక్కినేని ఎన్.టి.ఆర్ లాంటి వారితో మాత్రమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున లాంటీ స్టార్స్ తో పాటు హరీష్, శ్రీకాంత్ లాంటి యంగ్ హీరోలతో కూడా నటించారు.


Share

Related posts

ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమా హాలీవుడ్ స్థాయిలోనా…?

GRK

Vijaya Sai Reddy: అశోక్ గజపతిరాజుపై మరో సారి ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపి విజయసాయిరెడ్డి

somaraju sharma

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శంచుకున్న లోక్‌సభ స్వీకర్ ఓం బిర్లా

somaraju sharma