NewsOrbit
న్యూస్ హెల్త్

క‌రోనా సోక‌కున్నా శ‌రీరంలో యాంటీబాడీలు.. ఎలానో తెలుసా?

క‌రోనా వైర‌స్ కు వ్యాక్సిన్ ను క‌నుక్కునే ప‌నిలో ప్ర‌పంచలోని సైంటిస్టులు ఉన్నారు. అదే ప‌నిగా గంట‌ల త‌ర‌బ‌డి ల్యాబుల‌కే ప‌రిమితం అవుతున్నారు. ఎన్నో ప‌రిశోధ‌న‌లు మ‌రిన్నే టెస్టుల‌తో బిజీగా గ‌డుపుతున్నారు. అయితే ఈ ప‌రిశోధ‌న‌ల్లో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. అందులో కొన్ని ఆనంద ప‌డే విష‌యాలు.. మ‌రికొన్ని బాధ‌పెట్టే విష‌యాలు బ‌య‌ట ప‌డుతున్నాయి. అయితే ఈ మ‌ధ్య జ‌రిగిన ఒక ప‌రిశోధ‌న‌లో ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని సైంటిస్టులు భ‌య‌ట‌పెట్టారు.

కొంద‌రిలో ముందు నుంచి ఉండే యాంటీబాడీస్ వ‌ల్ల క‌రోనా వైస‌ర్ ను త‌ట్టుకునే శ‌క్తి వారిలో ఉంటుంద‌ని తెలిపారు. దాంతో వారికి క‌రోనా సోకిన కూడా ఏం కాద‌ని తెలిపారు. యూకేలోని ఫ్రాన్సిస్‌ క్రిక్‌ ఇన్‌స్టిట్యూట్‌, మ‌రికొంత మంది సైంటిస్టులు ఈ విష‌యాన్ని తెలిపారు. ఈ విష‌యాల‌ను ప‌లు ప‌త్రిక‌లు ప్ర‌చురించాయి.

కరోనా వైర‌స్ సోకని కొంతమందిలో, ముఖ్యంగా చిన్న‌ పిల్లల్లో ఈ ర‌క‌మైన యాంటీబాడీస్ ను గుర్తించిన‌ట్లు వారు పేర్కొన్నారు. అంటే కరోనా సోక‌కుండానే వారిలో దాన్ని నియంత్రించే యాంటీబాడీస్ ఉన్నాయ‌న‌ని అర్థం. జలుబుకు కారణమయ్యే వైరస్ ల‌‌ వల్ల ఇవి ఏర్పడి ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. వీటి నిర్మాణం సార్స్ ను పోలి ఉంటుంద‌ని తెలిపారు. దీంతో వారు కరోనా బారిన పడగానే ముందునుంచే ఉన్న యాంటీబాడీస్ వాటితో పోరాడుతాయ‌ని తెలిపారు.

క‌రోనా వైర‌స్ యాంటీబాడీ పరీక్షల కోసం అభివృద్ధి చేసిన ఒక‌ పరీక్షా విధానాన్ని ఈ రీసెర్చు లో సైంటిస్టులు వాడార‌ని స‌మాచారం. కరోనా వైర‌స్ సోకిన వారు, కరోనా వైర‌స్ సోకని వారి బ్లెడ్ సాంపిల్స్ ను ఇందులో పరీక్షించారు. కరోనా వైర‌స్ బారిన పడనివారిలోనూ ఈ యాంటీబాడీలు ఉన్నాయ‌ని గుర్తించారు. దీన్ని రుజువు చేయ‌డానికి క‌రోనా వైర‌స్ రాకంటే ముందు 2011-2018 మధ్యలో సేకరించిన కొన్ని బ్లెడ్ సాంపిల్స్ ను సైంటిస్టులు ప‌రిశీంచారు. దాంతో అన్నింటిలో కరోనా వైరస్‌తో పోరాడే యాంటీబాడీస్ ను గుర్తించారు. ప్రతి 20 మందిలో కనీసం ఒకరిలోనైనా ఈ ర‌క‌మైన యాంటీబాడీస్ ఉన్నాట్లు సైటిస్టులు క‌నుగొన్నారు. ఇది 6 ఏళ్ల‌ నుంచి 16ఏళ్ల మధ్య ఉన్న వారిలో ఎక్కువ‌గా ఉన్నాట్లు తెలిపారు.

ఇలా ప‌లు యాంటీబాడీస్ మీద ప‌రిశోధ‌న‌లు చేశారు. ఈ జ‌లుబును క‌లిగించే వాట‌ని ఎదుర్కొన‌డానికి త‌యారైన యాంటీబాడీస్ క‌రోనాను కూడా ఎదుర్కొంటాయ‌ని ఈ ప‌రిశోధ‌న వ‌ల్ల బ‌య‌ట ప‌డింది.ఈ రీసెర్చ్ లో ఎస్‌-2పై దాడి చేసి కూడా కరోనాను అంతం చేయొచ్చ‌ని తెలుసుకున్నారు.వీటి సాయంతో సమర్థమైన వ్యాక్సిన్లను త‌యారు చేసే అవ‌కాశం ఉంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!