Anu Emmanuel: అయ్యో పాపం, అను ఇమ్మాన్యుయేల్‌కి ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి..!

Share

Anu Emmanuel: మలయాళీ ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్‌ ‘మజ్ను’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీ తొలి పరిచయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ హీరోయిన్ మలయాళం సినిమాలతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. తన మొట్టమొదటి సినిమా ‘స్వప్న సంచారి’ కాగా ఆ మలయాళ మూవీలో బాలనటిగా నటించి మెప్పించింది. ఈ క్యూట్ యాక్ట్రెస్ అజ్ఞాతవాసి సినిమాలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తో జత కట్టింది. బన్నీతో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాలో చేసింది. అయితే మెగా హీరోలతో నటించిన కూడా ఆమెకు ప్లాప్స్ యే ఎదురయ్యాయి. యాక్షన్ హీరో గోపీచంద్ తో నటించిన ఆక్సిజన్.. నాగచైతన్యతో చేసిన శైలజ రెడ్డి అల్లుడు.. అలానే అల్లుడు అదుర్స్, మహాసముద్రం సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అయితే ఇలా వరుసగా డిజాస్టర్లు అందుకుని ఫ్యాన్స్‌కు షాకులిచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరో కారణంతో షాక్ ఇస్తోంది.

Anu Emmanuel: ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి, పాపం!

చాలా డిజాస్టర్లు వచ్చాక అను వైపు చూడటమే మానేశారు టాలీవుడ్ దర్శకులు. అయితే అను ఇమ్మాన్యుయేల్‌కి మాస్ మహారాజా రవితేజతో కలిసి ‘రావణాసుర’ మూవీలో నటించే ఒక అవకాశం దొరికింది. అయినా కూడా ఫ్యాన్స్ సంబర పడటం లేదు. ఎందుకంటే ఈ సినిమాలో ఇమ్మానుయేల్‌తో పాటు మెగా ఆకాష్, ఫారియా అబ్దుల్లా, దక్షా, పూజిత పొన్నాడా వంటి హీరోయిన్స్ కూడా నటించనున్నారు. ఈ లెక్కన చూసుకుంటే రావణాసుర సినిమా హిట్ అయినా అనుకి ప్రత్యేకంగా వచ్చే గుర్తింపు ఏమీ ఉండదు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ కూడా ఇప్పుడు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ప్రేక్షకులు కూడా అయ్యో పాపం అని అంటున్నారు. కనీసం సెకండ్ హీరోయిన్ కూడా కాదు.. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాల్సిన పరిస్థితి అనుకి వచ్చింది ఏంటి? అని సానుభూతి చూపిస్తున్నారు.

అల్లు శిరీష్ సినిమాపైనే అన్ని హోప్స్!

డిజాస్టర్‌ కా బాప్‌ అనే కీర్తి గడించిన అల్లు శిరీష్ ప్రేమ కాదంట అనే సినిమా చేస్తున్నాడు. డిజాస్టర్‌ కా క్వీన్ అని ఇప్పటికే పేరు తెచ్చుకున్న అనుని ఈ మూవీ హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఘాటైన రొమాన్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు మత్తెక్కించనుందని గతంలో విడుదలైన ఒక మోషన్ పోస్టర్ చెప్పకనే చెప్పింది. ఈ సినిమా లివ్-ఇన్ రిలేషన్ షిప్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తుందని ఇప్పటికే మూవీ యూనిట్ ప్రకటించింది. యూత్ మెచ్చే సినిమా లాగానే ఇది వస్తుందని అర్థమవుతోంది.

గతేడాది ఎప్పుడో ఈ సినిమా నుంచి ఒక అప్‌డేట్ వచ్చింది ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమా గురించి అందరూ మరిచిపోయారు. ఈ మూవీ సెప్టెంబర్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ సమయానికి ఒక నెల రోజుల నుంచి దీనిని బాగా ప్రమోట్ చేసే అవకాశం ఉంది. మూవీ హిట్ అయితేనే అను కెరీర్ మళ్లీ గాడిన పడుతుంది. లేదంటే తట్టా బుట్టా సర్దేసి, చాప చుట్టేసి ఇండస్ట్రీ వదిలి వెళ్లి పోవాల్సిందే!

 


Share

Recent Posts

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

5 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

57 mins ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago

కడుపు ఉబ్బరం సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి..!

ఆహారం లేకుండా జీవించాలంటే చాలా కష్టం.ఆహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉండగలం. కానీ ఆహారం లేకుండా మాత్రం మనిషి మనుగడ లేదు.గుప్పెడు అన్నం మెతుకుల…

3 hours ago