Anuradha Jyeshthanakshatra: అనూరాధ మొదటి పాదం రవి కి చెందినది.వీరు ఇతరులతో మాట్లాడే మాటలు వినయ ,విధేయతలు కలిగి ఉంటాయి. నీతి నియమాల తో ఉంటారు. మంత్రోపాసన ( Mantropasana ) చేసేవారుగా మంత్రాంగాలు నడిపేవారుగా ఉంటారు.అనూరాధ నక్షత్ర రెండొవ పాదం బుధుడి కి చెందినది. వీరికి వీణా వాయిద్యాల పట్ల చాల ఇష్టం ఉంటుంది. ఆదర్శమూర్తులు గా మేధావులుగా వీరు ఉంటారు.అనూరాధ నక్షత్ర మూడో పాదం శుక్రుడి కి చెందినది ది. ఈ పాదం లో పుట్టిన వారికీ స్ధిరత్వం అనేది ఉండదు. అనుకూలమైన భార్య ను పొందుతారు.అనూరాధ ( Anuradha ) నక్షత్రం నాల్గొవ పాదం కుజుడి కి చెందినది. ఈ పాదం లో పుట్టినవారు ఇతరులకు ద్రోహం చేయడం తో పాటు కుట్రలు,మరియు కుతంత్రాలు చేస్తారు. దీనితో తో పాటు, దరిధ్రులు గా కూడా అవుతారు.
Anuradha Jyeshthanakshatra: జ్యేష్ఠ నక్షత్ర నాలుగు పాదాలు
జ్యేష్ఠ మొదటి పాదం గురువు కి చెందినది. వీరు రచనా సామర్ధ్యం కలవారిగా ఉంటారు. హాస్య ప్రియత్వం తో పాటు , గర్వం కలిగి ఉంటారు. జ్యేష్ఠ రెండొవ పాదం శని కి చెందినది. ఎల్లవేళలా ఏదో ఒక అనారోగ్యం బాదిస్తుంటుంది. ఇతరులకు తేలికగా లొంగిపోయేవారుగా వీరు ఉంటారు. జ్యేష్ఠ మూడోవ పాదం శని కి చెందినది.ఈ జాతకులు అంగవైకల్యం తో ఉంటారు. చాల అతి స్వల్పమైన భోగం మాత్రమే కలిగి ఉంటారు. చూపు సరిగా ఉండకపోవడం, ఇతరుల పనులు చేసేవారిగా ఉంటారు.
జ్యేష్ఠ నక్షత్ర నాల్గొవ పాదం గురువు కి చెందినది. వీరికి వినికిడి లోపం ఉంటుంది.అలాగే ధర్మ శాస్త్రాల మీద పట్టు కలిగి ఉంటారు. బాగా పూజలు చేసేవారిగా ,శాస్త్రవేత్తలుగా ఉంటారు.