ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. “మా కుటుంబం జనవరి 2021న ముగ్గురుగా మారబోతోంది” అని అనుష్క శర్మ ట్వీట్ చేసింది. అదే క్యాప్షన్ తో విరాట్ కోహ్లీ సైతం తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తో ట్వీట్ చేసింది.
క్యాప్షన్ బట్టి అనుష్క శర్మ నాలుగు నెలల గర్భవతి అని అర్ధమవుతోంది. 2017లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒక్కటైన విషయం తెల్సిందే. అయితే అప్పటినుండి అనుష్క శర్మ ప్రెగ్నన్సీ మీద రకరకాల రూమర్స్ వస్తున్నాయి. ఈ ఏడాది మొదట్లో ఈ రూమర్స్ చాలా ఎక్కువగా రావడంతో అనుష్క శర్మ రియాక్ట్ అయింది. ఎవరైనా పెళ్లి చేసుకుంటే వెంటనే ఇలా ప్రెగ్నన్సీ రూమర్స్ మొదలుపెట్టేస్తారు. ఏమీ లేకపోయినా ఏదో ఉందన్నట్లు క్రియేట్ చేస్తారు అని కామెంట్ చేసింది.