Casting Couch: అటు బాలీవుడ్ లో కానీ ఇటు దక్షిణ సీని పరిశ్రమలో కానీ ఈ మధ్య కాస్టింగ్ కౌచ్ Casting couch ఒక హాట్ టాపిక్ గా మారింది. అన్ని సినీ పరిశ్రమల లోనూ గత కొద్ది కాలంగా ఈ విషమై ఎన్నో విషాలు, వివాదాలు తెర మీదకు వచ్చాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఒక స్టార్ హీరోయిన్ టాలీవుడ్ లోని కాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే అరుంధతి సినిమాలో ఆమె నటనకు మన తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన అనుష్క శెట్టి. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ నేను ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని చెప్పడంలేదు అన్నది.
అంటే కాస్టింగ్ కౌచ్ ఉన్నట్టు ఆమె ఒప్పుకున్నట్లేగా అంటున్నారు నెటిజన్స్. టాలీవుడ్ లోని కాస్టింగ్ కౌచ్ గురించి అనుష్క చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతున్నాయి. సినీ ఇండస్ట్రీ లోనే కాదని ప్రతి రంగంలోనూ అమ్మాయిలకి ఈ తరహా సమస్యలు తప్పవని ఆమె చెప్పుకొచ్చింది. అయితే నా కెరీర్ ఆరంభంలో నేను కూడా ఈ తరహా సమస్యలు ఎదుర్కొన్నానని అనుష్క చెబుతోంది. ఆ సమయంలో నేను అవకాశాలను వదులుకున్నాను తప్ప ఈజీ వే లోకి వెళ్లలేదని ఆమె చెప్పింది.
ఎక్కడైనా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఈజీ వేతో పాటు కఠినమైన దారి కూడా ఉంటుంది వాటిలో తాను కఠినమైన దారినే ఎంచుకుని ఈ పోసిషన్ లోకి వచ్చానని ఆమె చెప్పింది. ముఖ్యంగా అమ్మాయిలు ఇలాంటి పరిస్థితులకి ‘నో’ చెప్తేనే పురుషులు స్త్రీలను గౌరవిస్తారని అంటోంది అనుష్క. మనకి టాలెంట్ ఉంటే ఈజీ వే అవసరం ఉండదని, అవకాశాలు వాటి అంతట అవే మన దగ్గరికి వస్తాయని చెప్పారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?