NewsOrbit
న్యూస్

ఏ పార్టీ పాలనలో అయినా ఆధిపత్యం.. అగ్రతాంబూలం వారివే !

పార్టీలేవైనా పెత్తనం ఆది నుండి ఇప్పటి వరకూ ఆ రెండు కులాలదే!ఉమ్మడి రాష్ట్రం స‌హా, విభ‌జిత రాష్ట్రం ఏపీలో కూడా రాజకీయ రంగంలో క‌మ్మ, రెడ్డి సామాజిక వర్గాలదే డామినేషన్!

any party they have special postion
any party they have special postion

ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా.. మ‌రో సామాజిక వ‌ర్గాన్ని తొక్కేయ‌డం, అణిచేయ‌డం, చుల‌కన చేయడం వంటి ప‌రిస్థితి లేదు.1983 లో టిడిపి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ లో కమ్మ రాజకీయం తారాస్థాయికి చేరింది. అంతకుముందు వరకు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో రెడ్లదే రాజ్యం.అలాగని కమ్మ పాలకులు రెడ్లను నిర్లక్ష్యం చేయలేదు రెడ్డి ప్రభువులు కమ్మవారిని తొక్కలేదు.టీడీపీ వ్యవ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ క‌మ్మ అయినా రెడ్డి సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. న‌ల్లప‌రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బెజ‌వాడ పాపిరెడ్డి, జానారెడ్డి, జీవ‌న్‌రెడ్డి స‌హా చాలా మంది రెడ్డి నాయ‌కులు ఎదిగారు.

మంత్రులుగా కూడా ప‌నిచేశారు.త‌ర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కోట్ల విజ‌య‌భాస్కర‌రెడ్డి, మ‌ర్రిచెన్నారెడ్డి హ‌యాంలోనూ.. క‌మ్మల హ‌వా బాగానే సాగింది. చిత్తూరు జిల్లాలో గల్లా అరుణ కుటుంబం, ప‌శ్చిమలో మాగంటి బాబు కుటుంబం, గుంటూరులో రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, కృష్ణాలో పిన్నమ‌నేని వెంక‌టేశ్వర‌రావు కుటుంబాలు బాగానే చ‌క్రం తిప్పారు.ఇక‌, త‌ర్వాత చంద్రబాబు చేతికి టీడీపీ ప‌గ్గాలు వ‌చ్చాక ఆయ‌న కూడా రెడ్డి వ‌ర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. శ్రీనివాస్‌ రెడ్డి, మాధ‌వ‌రెడ్డి, సోమిరెడ్డి, పోచారం శ్రీనివాస్ ‌రెడ్డి, రామ‌సుబ్బారెడ్డికి ప్రాధాన్యం ఇచ్చారు.


2004లో వైఎస్ సీఎం అయినా క‌మ్మ వ‌ర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. చిత్తూరులో గ‌ల్లా, ప‌శ్చిమ‌లో మాగంటి వ‌ర్గాల‌ను ఆయ‌న బాగానే చూసుకున్నారు. నాడు కృష్ణాలో దేవినేని నెహ్రూ హ‌వానే ఉండేది. గుంటూరులో రాయ‌పాటి,బెజ‌వాడ‌లో ల‌గ‌డ‌పాటి, ప‌ర్చూరులో ద‌గ్గుబాటి, మార్టూరులో గొట్టిపాటి లాంటి క‌మ్మనేత‌ల హ‌వా బాగానే న‌డిచింది. త‌ర్వాత కిర‌ణ్‌కుమార్‌రెడ్డి, రోశ‌య్యలు సీఎంలు అయినా.. రాష్ట్ర విభ‌‌జ‌న ఎఫెక్ట్‌తో వారు ఏ వ‌ర్గాన్నీ ప‌ట్టించుకోలేదు. స్థానికంగా ఎవ‌రికి బ‌లం ఉంటే వారినే ఎంక‌రేజ్ చేసుకుంటూ వ‌చ్చారు.అయితే 2014లో చంద్రబాబు ఏపీలో అధికారంలోకి వ‌చ్చాక క‌మ్మల‌కు అధిక ప్రాదాన్యం ఇచ్చారు.

ప్రతిపాటి పుల్లారావు, ప‌రిటాల సునీత, దేవినేని ఉమ, కామినేని శ్రీనివాస్ ఆ త‌ర్వాత త‌న త‌న‌యుడు లోకేష్‌ వంటి టీడీపీ నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. అప్పుడు అదే టీడీపీకి చెందిన గుంటూరు జిల్లా ప‌శ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు.ఇదే విషయాన్ని వైసిపి కూడా జనాల్లోకి తీసుకెళ్లింది.అయితే వైసిపి అధికారంలో కొచ్చాక రెడ్డి రాజ్యం అయిపోయిందని విమర్శలు లేకపోలేదు.నరసాపురం వైసిపి రెబల్ ఎంపీ విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రంలో రెడ్ టేపిజం లేదు రెడ్డిజ౦ ఉందని విమర్శించాడు.జగన్ కమ్మ సామాజిక వర్గాన్ని అణిచేస్తున్నాడన్న టాక్ కూడా ఉంది.సరే ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కమ్మ రెడ్లకు తప్ప మరే సామాజిక వర్గానికి ఆధిపత్యం,అగ్రతాంబూలం లభించే పరిస్థితులైతే లేనే లేవు

author avatar
Yandamuri

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju