NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ap assembly budget session: ఏపి అసెంబ్లీ సమావేశాలకు ఖరారైన ముహూర్తం

 

ap assembly budget session: ఏపి అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 20వ తేదీ నుండి సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. 2021-22 కు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ వర్చువల్ గా ప్రసంగించనున్నారు.  బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం ఎన్ని రోజులు నిర్వహిస్తుంది. కోవిడ్ నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం వరకే పరిమితం అవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ap assembly budget session

అయితే ఈ సమావేశాలను ఒకటి రెండు రోజుల్లోనే ముగించే అవకాశం ఉందని తెలుస్తోంది. బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదింపజేసుకోవడానికే అసెంబ్లీని సమావేశపరుస్తున్నట్లు సమాచారం. మార్చిలోనే ఈ బడ్జెట్ సమావేశాల్సి ఉన్నప్పటికీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం వాయిదా వేసింది. మూడు నెలల కాలానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్డినెన్స్ ద్వారా ఆమోదింపజేసుకున్న విషయం తెలిసిందే. బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించిన వెంటనే నిరవధికంగా వాయిదా వేస్తారని అంటున్నారు.

తొలి రోజు వర్చువల్ విధానంలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అనంతరం గవర్నర్ ప్రసంగానికి శాసనసభ, శాసనమండలి ధన్యవాదాలు తెలుపుతాయి. తదుపరి ఇటీవల కాలంలో మృతి చెందిన కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డికి సంతాపం ప్రకటిస్తాయి. రెండవ రోజు బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. దీనిపై చర్చించిన అనంతరం వాటిని ఆమోదిస్తారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju