AP Assembly Live Updates: మండలి/ అసెంబ్లీలో ఏం జరిగిందంటే..!?

AP Assembly Live Updates: TDP Walkout .. But YCP Did..
Share

AP Assembly Live Updates: శాసనసభ వర్షాకాల సమావేశాలు ఆరంభమయ్యాయి. ప్రస్తుతం సీఎం జగన్ మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆయన వివరిస్తున్నారు. అంతకు ముందు మహిళా సాధికారత అంశంపై మహిళా ఎమ్మెల్యేలు రోజా, ఉండవల్లి శ్రీదేవి, విడదల రజని తదితరులు మాట్లాడారు. మంత్రులు కూడా కొద్దిసేపు మాట్లాడిన అనంతరం సీఎం జగన్ ప్రసంగిస్తున్నారు. ఈ సమావేశాలు ఆరంభ సమయంలోనే టీడీపీ సభ్యులు నిరసనలు తెలియజేసి బయటకు వచ్చేసారు. ఈ రోజు శాసనసభ, మండలి సమావేశాలు ఎలా జరిగాయంటే..!?

AP Assembly Live Updates: టీడీపీ వాయిదా తీర్మానాలు..!

నిరసన ప్రదర్శనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు, శాసనసభ్యులు బ్యానర్ పట్టుకుని అసెంబ్లీ వరకు పాదయాత్రగా వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ భారంగా మారిన పెట్రో ధరలు తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయన్నారు. చెత్తపై పన్ను వంటి నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలన్నారు. సామాన్యులు ఈ పాలనలో చితికి పోతున్నారని అన్నారు. అనంతరం… ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రో ధరలపై టీడీపీ వాయిదా తీర్మానాన్ని అందజేసింది. టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంపై టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.

AP Assembly Live Updates: TDP Walkout .. But YCP Did..
AP Assembly Live Updates: TDP Walkout .. But YCP Did..

ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సాంప్రదాయాలు నాకు తెలుసు… మీరు చెప్పినట్లు నేను సభ నడపాలా’’ అంటూ స్పీకర్ వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ సభలో టీడీపీ ఎమ్మెల్యేలు తమ నిరసనను కొనసాగించారు. ఏపీ అసెంబ్లీలో 27 అంశాలపై చర్చ జరపాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బీఏసీ ముందు ఉంచారు. పెట్రో ధరలు తగ్గింపు, రోడ్ల దుస్థితి, మహా పాదాయాత్రపై చర్చకు టీడీపీ డిమాండ్ చేస్తోంది. అలాగే ఎయిడెడ్ విద్యా సంస్థలు, పీర్సీ, ఆర్థిక సంక్షోభం వంటి అంశాలపై చర్చ జరగాలని టీడీపీ ప్రతిపాదనలు చేసింది. దేనికి ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో కాసేపటికి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. శాసనమండలిలో కూడా ఇదే సీన్ నెలకొంది.

వైసీపీ తీర్మానాలు.. చర్చలు..!

ప్రతిపక్షం లేకపోవడంతో వైసీపీ సభ్యులు, మంత్రులు సభను కొనసాగించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఇతర కీలక అంశాలపై చర్చిస్తూ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగం మొదలు పెట్టారు. రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం, మహిళల ఆర్ధిక అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. సభ ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ నెల 26 వరకు శాసనసభను నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈరోజు వాకౌట్ చేసిన టీడీపీ రేపటి నుండి వస్తుందా..? లేదా అనేది ప్రస్తుతానికి సందేహమే..!


Share

Related posts

ప‌బ్‌జి మొబైల్ ప్రియుల‌కు షాక్‌.. ఇక పూర్తిస్థాయిలో గేమ్ నిలిపివేత‌…

Srikanth A

జ‌గ‌న్‌ను బుక్ చేయాలంటే ఇదే బెస్ట్ ఆప్ష‌న్‌

sridhar

Corona Effect In Theaters : తెలంగాణలో థియేటర్లు యధాతథం..

bharani jella