NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాల నాలుగో రోజు ఇలా..

Share

AP Assembly: ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష టీడీపీ సభ్యులు సమావేశాలను బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అధికార పక్ష సభ్యుల మధ్య అసెంబ్లీ కార్యకలాపాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను డిప్యూటి సీఎం బూడి ముత్యాలనాయుడు వివరించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల రూపు రేఖలు మారాయన్నారు. సచివాలయ వ్యవస్థతో ప్రభుత్వ సేవలు అన్నీ ప్రజల వద్దకే అందిస్తున్నామన్నారు. సచివాలయాల్లో ఎప్పటికప్పుడు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. అర్హతే ప్రామాణికంగా పథకాలు అందుతున్నాయి. ప్రతి పథకంలోనూ పారదర్సకతకే ప్రాధాన్యం ఇచ్చారన్నారు. సచివాలయ వ్యవస్ధ తో దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. సచివాలయాల ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు.

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్  లపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి ధర్మాన ప్రసాదరావు సమాధానం ఇచ్చారు. ప్రభుత్వాలు వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటాయని తెలిపారు. రిజిస్ట్రేషన్లలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు. ఆన్ లైన రిజిస్ట్రేషన్లలో పోర్జరీ అనేది కంట్రోల్ అయిపోతుందని చెప్పారు. ఇచ్చిన కాపీ పత్రం డూప్లికేట్ అనడానికి లేదనీ.. అదే ఒరిజినల్ దానికి బ్యాంకులు కూడా అంగీకరిస్తాయన్నారు. దానిపై ఆ మేరకు చట్టం కూడా తీసుకువచ్చే విధానం తీసుకొచ్చామన్నారు. దీనిలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే తీసుకున్నామని. ఎవరికీ ఎలాంటి అపోహలు వదద్ని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు.

ఆలయాల్లో ధూప ధీప నైవేద్య పథకం పై అడిగిన ప్రశ్నకు మంత్రి కొట్టు సత్యనారాయణ సమాధానం ఇచ్చారు. ఈ స్కీమ్ కోసం బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు. దేవాలయ వ్యవస్థను పారదర్శకంగా నడుపుతున్నామన్నారు. ఇంకా కొన్ని దేవాలాయాలను ధూప దీప  నైవేద్యాల స్కీమ్ లో చేర్చాలన్నారు. అర్చకులకు ప్రభుత్వం అండగా నిలవడం అభినందనీయమన్నారు.  దేవాలయ అభివృద్ధికి గత ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించిందని అన్నారు మల్లాది విష్ణు. చంద్రాబాబు ఏనాడూ పట్టించుకోలేదన్నారు. జగన్ ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుందన్నారు. బియ్యం ఎగుమతి అంశాలపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి సమాధానమిచ్చారు.

ప్రశ్నోత్తరాల అనంతరం ఇవేళ ఉన్నత విద్య మండలి తరపున జవహర్ లాల్ టెక్నికల్ యూనివర్శిటీస్ సవరణ చట్టం 2021 ను మంత్రి బొత్స సభ ముందు ఉంచనున్నారు. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ 22వ వార్షిక నివేదికను 2021 – 22 సంవత్సరానికి గానూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సభ ముందు ఉంచనున్నారు. అలాగే నేడు పలు బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ సివిల్ కోర్టు సవరణ బిల్లు 2023 ను సీఎం జగన్ సభ ముందు ఉంచి ఆమోదం పొందనున్నారు.

నేడు రెండు స్వల్పకాలిక చర్చలకు సభలో సమయం కేటాయించనున్నారు. వ్యవసాయ శాఖలో అభివృద్ధి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఫైబర్ నెట్ లిమిటెడ్ లో అవినీతిపై సభలో స్వల్ప కాలిక చర్చ జరగనుంది. అటు శాసనమండలిలోనూ ప్రభుత్వం పలు బిల్లులను సభ ముందు ఉంచి ఆమోదింపచేసుకోనుంది. శాసనమండలిలో స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ పై స్వల్ప కాలిక చర్చ జరగనుంది.

Chandrababu Arrest: ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటీషన్ల విచారణపై సందిగ్ధత.. సెలవులో న్యాయమూర్తి


Share

Related posts

బాబుకు ఆ క్రెడిట్ లేకుండా చేస్తున్న బుద్ద వెంకన్న!

CMR

Lock Down: లాక్ డౌన్ ఎత్తేస్తున్నారు… తెలంగాణ‌లోనే కాదు ఈ రాష్ట్రాల్లో కూడా…

sridhar

2021 లో సుకుమార్ – అల్లు అర్జున్ ల పుష్ప రావడం కష్టమేనా .?

GRK