NewsOrbit
న్యూస్

ద్విపాత్రాభినయంపై తమ్మినేని క్లారిటీ!

స్పీకర్ వ్యవస్థపై రకరకాల భిన్న స్వరాలు వినిపిస్తుంటాయి! స్పీకర్ అధికారపక్షం వైపే మాట్లాడుతున్నారని, ప్రతిపక్షాలను కన్నెత్తి చూడనివ్వడం లేదని, నోరెత్తి మాట్లాడనివ్వడం లేదని విమర్శలు వస్తుంటాయి. ఈ విషయంలో గతంలోని కోడెల శివప్రసాద్ పై వచ్చిన విమర్శలతో పోలిస్తే తమ్మినేని కాస్త జాగ్రత్త పడుతున్నారనే అనుకోవాలి. ఆ సంగతి అలా ఉంచితే.. తాజాగా ఆయన ద్విపాత్రాభినయంపై క్లారిటీ ఇచ్చారు!

అసెంబ్లీలోనే.. ఆ కుర్చీ ఎక్కిన సమయంలోనే తాను స్పీకర్ ని అని, అనంతరం తన నియోజకవర్గంలోని ప్రజలకు ఎమ్మెల్యేని అని.. ఆ విషయం మీడియా మరిచిపోకూడదని చెబుతున్నారు తప్పినేని సీతారాం. సీఎం జగన్ దయతోనే ఎమ్మెల్యే అయ్యానని నిత్యం చెప్పే ఆయన… మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేశారు.

ఆముదాలవలసలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడిన ఆయన… “తాను వైసీపీ ఎమ్మెల్యేని.. వైసీపీలో ప్రాథమిక సభ్యుడిని.. అలాంటి నేను వైఎస్ జయంతి నిర్వహించకపోతే ఎలా?.. స్పీకర్ అంటే మూతి ముడుచుకుని కూర్చోవాలా.. అలా అయితే నియోజకవర్గ ప్రజల పనులు ఎవరు చేస్తారు..” అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇదే క్రమంలో బయట ఎన్ని మాట్లాడినా, పార్టీకి ఎంత మద్దతుగా ఉన్నా కూడా… అసెంబ్లీలో మాత్రం నూటికి నూరు శాతం సభాపతిని అన్న విషయం స్పష్టం చేశారు తమ్మినేని.

Related posts

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju