NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP: ఏపిలో బార్లకు న్యూ పాలసీ… వివరాలు ఇవీ

AP: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని సమూలంగా మార్చేసిన సంగతి తెలిసిందే. గతంలో మద్యం షాపులకు ఉన్న ఆక్షన్ విధానాన్ని పూర్తిగా ఎత్తివేసింది. ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తొంది. అప్పట్లోనే రాష్ట్రంలో బార్ల నిర్వహణకు సంబంధించి కూడా న్యూ పాలసీ తీసుకురావాలని ప్రయత్నం చేసింది కానీ బార్ లకు గత ప్రభుత్వ హయాంలోనే 2022 జూన్ నెలాఖరు వరకూ లైసెన్స్ లు మంజూరు చేసి ఉండటంతో సాధ్యం కాలేదు. ఈ నెలాఖరు నాటికి బార్ లైసెన్సుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం 2022 – 23 ఆర్ధిక సంవత్సరానికి గాను రాష్ట్రంలోని బార్లకు న్యూ పాలసీని ప్రకటించింది.

AP Bar new policy details
AP Bar new policy details

 

పట్టణ ప్రాంతాలు, మున్సిపల్ కార్పోరేషన్ లు, నగర పంచాయతీల పరిధిలో ఎన్ని బార్లు ఉండాలన్నది ఎక్సైజ్ కమిషనర్ నిర్ణయిస్తారు. మున్సిపల్ కార్పోరేషన్ లో పది కిలో మీటర్ల పరిధిలో, మున్సిపాలిటీల్లో మూడు కిలో మీటర్ల పరిధిలో బార్లు ఏర్పాటు చేసుకోవచ్చు. మూడేళ్ల కాలపరిమితితో కొత్త బార్లకు లైసెన్సులు మంజూరు చేస్తారు. బార్లకు లైసెన్సు ఫీజుతో పాటు నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ చార్జీలు ఏడాదికి పది శాతం పెంచనున్నారు. కొత్త బార్ పాలసీ సెప్టెంబర్ 1వ తేదీ నుండి అమలులోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. న్యూ బార్ ల పాలసీ సెప్టెంబర్ 1 నుండి అమలు చేయనున్నందున ప్రస్తుతం ఉన్న బార్ లైసెన్సులను మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా ఉత్తర్వులతో బార్ల లైసెన్సు కాలపరిమితిని జూలై 1 నుండి ఆగస్టు 31 వరకూ పొడిగించారు. లైసెన్సు పొడిగించిన రెండు నెలల కాలానికి బార్ల నుండి ఫీజును ఈ నెల 27వ తేదీన ప్రభుత్వం వసూలు చేయనుంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju