NewsOrbit
న్యూస్

కన్నా నిరసన దీక్ష

గుంటూరు : ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు, బిల్డ్ ఏపీ పేరుతో భూముల అమ్మకంపై ఆయన మంగళవారం గుంటూరులో తన స్వగృహం ఎదురుగా పార్టీ నేతలతో కలసి నిరసన దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన జగన్ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుర్తించారు. ప్రభుత్వంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే జగన్ అనేక విధాలుగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కరోనా కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే విద్యుత్ శ్లాబ్‌లు మార్చారనీ, ప్రజలంతా లాక్‌డౌన్‌తో ఇళ్లలో ఉన్న సమయంలో ఇలా చేయడం దుర్మార్గమని అన్నారు.

విద్యుత్ వినియోగదారుల ఏడాది వినియోగం ఆధారంగా గతంలో ఏబీసీ గ్రూపులుగా విభజించారని చెబుతూ నేడు కరోనా లాక్ డౌన్ కారణంగా మధ్య తరగతి ప్రజలు కూడా 225 యూనిట్లుపైగా వినియోగించాల్సి వచ్చిందని అన్నారు. విద్యుత్ బిల్లులు పెంచలేదని ప్రభుత్వం చాలా తెలివిగా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శ్లాబ్ మార్పు కారణంగా పేద, మధ్యతరగతి వినియోగదారులు కూడా గ్రూపు సిలోకి మారిపోయారనీ, దీంతో గతంలో కంటే రెండు, మూడు రెట్లు బిల్లులు పెరిగాయని కన్నా అన్నారు.

తాను కూడా మార్చి నెలలో రూ.11,541 వేలు కరెంట్ బిల్లు చెల్లించగా, ఈ నెలలో బిల్లు రూ.20 వేలు దాటిందనీ చెప్పారు. ఈ విధంగా కరెంట్ బిల్లులు వస్తుంటే ప్రభుత్వం మాత్రం బిల్లులు పెంచలేదని ఎలా చెబుతుందని కన్నా ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అన్ని ధరలు పెంచుతున్నారని విమర్శించారు. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెట్టారనీ దుయ్యబట్టారు. గుంటూరులో మార్కెట్ స్థలాన్ని ఏపీ బిల్డ్ కోసం అమ్మకానికి పెట్టడం దారుణమని అన్నారు. వందలాది మంది మార్కెట్‌పై ఆధారపడి ఉన్నారనీ గుర్తు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే వృద్ధురాలిపై కేసు పెడతారా.. ఇలా ఎంత మందిని అరెస్టు చేస్తారు అని కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Leave a Comment