25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కలకలాన్ని రేపుతున్న వైసీపీ సోషల్ మీడియా పోస్టు .. జగన్ హిందువులకు క్షమాపణ చెప్పాలంటూ ఏపీ బీజేపీ డిమాండ్

Share

వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపై ఏపి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. సీఎం వైఎస్ జగన్ .. బాల శివుడికి పాలు పట్టిస్తున్న పోస్టర్ ను వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి వెంటనే తొలగించాలని, సీఎం వైఎస్ జగన్ బేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. వైసీపీ ట్విట్టర్ ఖాతాలో హేళన చేస్తున్నట్లుగా చిత్రాన్ని ప్రదర్శించడంపై బీజేపీ సీరియస్ అయ్యింది. ఈ రోజు 12 గంటల నుండి రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాల వద్ద నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు సోము వీర్రాజు.

Somu Veerraju Fires on CM Jagan

 

పేద వాళ్లు అని పేర్కొంటూనే చేతిలో డమరుకాన్ని చిత్రీకరించిన చర్య హైందవ ధర్మం మరియు హిందువుల మనోభావాల పట్ల వైసీపీ ప్రభుత్వం యొక్క చులకన భావానికి ప్రతీక అని విమర్శించారు. ఇలాంటి ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తూ హైందవ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న గిరిజన సంక్షేమ హాస్టళ్లు, బీసీ, ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో ఉండే పిల్లలకు సరిగా తిండిపెట్టలేదు గాని, శివుడికి పాలు పోసిశివతత్వాన్ని భోదించేస్తారు మన  వైఎస్ జగన్ గారు అంటూ సోము సెటైర్ వేశారు.

గత కొంత కాలంగా వైసీపీ ప్రభుత్వం పై ఏపీ బీజేపీ విమర్శల దాడి పెంచింది. అధికారిక పర్యటనలో పాల్గొన్న కేంద్ర మంత్రులు ఏపీలో జగన్మోహనరెడ్డి అమలు చేస్తున్న పథకాలను ప్రశంసిస్తుండగా, పార్టీ కార్యక్రమాల్లో మాత్రం బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం పైగా నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తమ స్టిక్కర్ లు వేసుకుని ప్రచారం చేసుకుంటోందని విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో అధికార వైసీపీకి తాము ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటూ బీజేపీ నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

పాదయాత్ర అనుమతులు రద్దు చేసి వైఎస్ షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు .. మహబూబాబాద్ లో ఉద్రిక్తత


Share

Related posts

నేనూ యాక్సిడెంటల్ ప్రైం మినిస్టర్‌నే!

Siva Prasad

బ్రేకింగ్: ఆళ్ల రామకృష్ణారెడ్డిని అడ్డుకున్న స్థానిక ప్రజలు

Muraliak

Radheshyam: 400 కోట్లు..! రాధేశ్యామ్ కి భారీ ఆఫర్ చేసిన అమెజాన్ ప్రైమ్..!?

Srinivas Manem