ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజును ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఛలో అమలాపురం కార్యక్రమానికి ఆయన బయల్దేరడంతో ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలో సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నందున అదుపులోకి తీసుకున్నారు.
దేవాలయాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఛలో అమలాపురం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సోము వీర్రాజు తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఐదు పార్లమెంట్ నియోజిక వర్గాలకు చెందిన బిజెపి కార్యకర్తలు ఈ ఛలో అమలాపురం కార్యక్రమంలో పాల్గొంటారని సోము వీర్రాజు తెలిపారు. బిజెపి నేత విష్ణు కుమార్ రాజును ఈ విషయంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. అంతర్వేదికి వెళతామని ఆయన ప్రకటించడంలో పోలీసులు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేసారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?