NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బెడిసికొట్టిన బీజేపీ అస్త్రం..??

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన తరువాత ఏపీ రాజకీయాల్లో బీజేపీ పేరు డబల్ త్రిబుల్ అయింది. ప్రతిపక్షం పార్టీ టీడీపీ చేయని రీతిలో ప్రభుత్వం పై బిజెపి ఆధ్వర్యంలో అతి తక్కువ కాలంలోనే పోరాటానికి తెగబడింది. దేవాలయాల పై దాడుల విషయంలో గాని మరి కొన్ని విషయాల్లో గాని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై నిరసన వ్యక్తం చేస్తూ టీడీపీ కంటే చాలా యాక్టివ్ గా ఉంది. ఇదిలా ఉండగా పార్టీలో కోవర్టులు కు చెక్ పెట్టే రీతిలో బిజెపి చేస్తున్న ప్రయోగం బెడిసికొడుతున్నట్లు ఏపీ మీడియా సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి.

BJP to announce its Delhi CM face in first week of January: sources - The  Weekఏపీ బీజేపీ లో ఉన్న నాయకులు ఎవరికి వారు ఇష్టానుసారంగా మీడియా ముందు తమ అభిప్రాయాలను హైకమాండ్ కి చెప్పకుండానే మాట్లాడే పరిస్థితులు ఇటీవల ఏర్పడటంతో… మీడియాతో మాట్లాడే వారి నాయకుల పేర్లు ఒక జాబితాగా తయారుచేసి బీజేపీ హైకమాండ్ రిలీజ్ చేసింది. ఈ క్రమంలో బిజెపి పార్టీ తరఫున ఎప్పటినుండో వాయిస్ వినిపిస్తున్న వారి పేర్లు జాబితాలో లేకపోవడంతో.. బిజెపి అస్త్రాలు బెడిసి కొట్టినట్లు కనబడుతోంది. పార్టీ తరఫున టీవీ చర్చలో వీళ్లే పాల్గొనాలి, వీరిని మీడియా పిలవాలి అంటూ తాజాగా ఓ జాబితా రిలీజ్ చేసింది బిజెపి.

 

అందులో అధికార ప్రతినిధుల తో సహా వివిధ పదవుల్లో ఉన్న 25 మందికి చోటు కల్పించారు. ఇదే ఇప్పుడు ఏపీ బీజేపీలో రచ్చరచ్చ అవుతుంది. ఈ జాబితా వెనుక పెద్ద కథే ఉన్నట్లు సమాచారం. టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే వారిలో వేరే పార్టీకి సంబంధించిన కోవర్ట్ లు  ఉన్నట్లు అనే అనుమానం అధిష్టానానికి ఎప్పటినుండో ఉందట. బీజేపీ పార్టీ పేరు తో చర్చలకు వెళ్తున్న సదరు నేతలు వేరే పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని వారికి అనుకూలంగా వాయిస్ వినిపిస్తున్నారని గుర్తించడం జరిగిందట. అలాంటివారికి కత్తిర వేయడానికి అధికార పేర్ల జాబితాను… అధికారికంగా బిజెపి నేతలు విడుదల చేశారట.

 

ఇలాంటి తరుణంలో ఎప్పటినుండో బిజెపి పార్టీ తరఫున వెళుతున్న కొంతమంది కీలక నాయకుల పేర్లు ఈ జాబితాలో లేకపోవడం తో… చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అదే రీతిలో కోవర్టుగా పార్టీ అనుమానిస్తున్న ఒకరిద్దరి పేర్లు జాబితాలో ఉన్నాయట. ఇదే గందరగోళానికి దారి తీసింది. అదేవిధంగా వివాదాలు సృష్టించే విధంగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. ఈలోపే మీడియా ముందు వెళ్లే మాట్లాడాలని తీసుకొచ్చిన జాబితా మరింతగా ఏపీ బిజెపి నేతలకు హైకమాండ్ పై కీలక నాయకులపై లో లోపల అసహనం చెబుతున్నట్లు సమాచారం 

 

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju