అక్టోబర్ 1న ఏపి కేబినెట్ భేటీ

(అమరావతి నుండి “న్యూస్ ఆర్పిట్” ప్రతినిధి)

ఏపీ ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం మరో సారి జరగనున్నది. అక్టోబర్ ఒకటవ తేదీన ఉదయం 11గంటలకు వెలగపూడి సచివాలయంలో కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు.

AP cabinet file photo

ఈ నెల 3వ తేదీన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపిన విషయం విదితమే. అక్టోబర్ 1న జరిగే కేబినెట్ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి మరి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత క్యాబినెట్ భేటీ వ్యవసాయరంగంలో ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకంతో సహ పలు కీలక విషయాలపై చర్చించి ఆమోదించింది